Sangareddy: గుండెపోటుతో ఐదవ తరగతి విద్యార్థి మృతి
ABN, Publish Date - Sep 14 , 2024 | 04:48 AM
పట్టుమని పదేళ్లు కూడా నిండని బాలుడు గుండెపోటుతో మరణించిన ఘటన సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం మనియార్‌పల్లిలో జరిగింది.
కోహీర్, సెప్టెంబరు 13: పట్టుమని పదేళ్లు కూడా నిండని బాలుడు గుండెపోటుతో మరణించిన ఘటన సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం మనియార్‌పల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన బల్లెపు శ్రీనివా్‌సకు ముగ్గురు కుమారులు. చిన్న కుమారుడైన అఖిల్(10) అక్కడి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. అతను గురువారం అస్వస్థతకు గురికాగా, మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులకు చూపించి ఇంటికి తీసుకువచ్చారు.
అయితే, శుక్రవారం ఉదయం పాలు తాగిన బాలుడు... కాసేపటికే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు వెంటనే కోహీర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గుండెపోటు వల్లే అఖిల్ చనిపోయినట్లు గ్రామస్థులు చెప్పారు.
Updated Date - Sep 14 , 2024 | 04:48 AM