ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Asifabad: అనారోగ్యంతో డీఎడ్‌ విద్యార్థిని మృతి

ABN, Publish Date - Dec 22 , 2024 | 05:09 AM

కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా బెజ్జూరు మండలం అందుగులగూడ గ్రామానికి చెందిన డీఎడ్‌ విద్యార్థిని తొర్రెం వెంకటలక్ష్మి(19) శుక్రవారం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌ బీసీ పోస్ట్‌మెట్రిక్‌ వసతిగృహంలో అనారోగ్యంతో మృతి చెందింది.

  • ఆసిఫాబాద్‌ జిల్లా జన్కాపూర్‌ బీసీ పోస్ట్‌మెట్రిక్‌ హాస్టల్‌లో ఘటన

బెజ్జూరు, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా బెజ్జూరు మండలం అందుగులగూడ గ్రామానికి చెందిన డీఎడ్‌ విద్యార్థిని తొర్రెం వెంకటలక్ష్మి(19) శుక్రవారం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌ బీసీ పోస్ట్‌మెట్రిక్‌ వసతిగృహంలో అనారోగ్యంతో మృతి చెందింది. వసతిగృహం అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె మృతి చెందిందని ఆరోపిస్తూ శనివారం అందుగులగూడలో కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. వారికి స్థానిక నాయకులు మద్దతు పలికారు.


రెండుగంటలపాటు ఆందోళన చేయగా.. కౌటాల సీఐ ముత్యం రమేష్‌, ఎస్సైలు ప్రవీణ్‌కుమార్‌, నరేష్‌, మధుకర్‌ ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేసినా వారు శాంతించలేదు. సబ్‌ కలెక్టర్‌ వచ్చి న్యాయం చేయకుంటే విద్యార్థి మృతదేహంతో ఆసిఫాబాద్‌ వెళ్లి ధర్నా చేస్తామన్నారు. ఈక్రమంలో మృతదేహాన్ని ఆసిఫాబాద్‌ తీసుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. కాగా మృతిచెందిన విద్యార్థిని కుటుంబాన్ని కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధాశుక్లా పరామర్శించారు. విద్యార్థిని మృతిపై కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - Dec 22 , 2024 | 05:09 AM