ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kamareddy: కులాల జాబితాలో మా కులమేది?

ABN, Publish Date - Nov 12 , 2024 | 04:27 AM

సమగ్ర కుటుంబ సర్వేలో కులాల జాబితాలో తమ కులం పేరు లేదంటూ కామారెడ్డి జిల్లా పెద్దకొడ్‌పగల్‌ మండలంలో 2 వేల మథుర లంబాడా కుటుంబాలు సర్వేను బహిష్కరించాయి.

  • కులం పేరు తప్పుగా ఉందని సర్వే బహిష్కరణ

  • కామారెడ్డి జిల్లాలో 2 వేల మఽథుర లంబాడా కుటుంబాల నిర్ణయం

పెద్దకొడ్‌పగల్‌, ఖమ్మం సంక్షేమ విభాగం, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): సమగ్ర కుటుంబ సర్వేలో కులాల జాబితాలో తమ కులం పేరు లేదంటూ కామారెడ్డి జిల్లా పెద్దకొడ్‌పగల్‌ మండలంలో 2 వేల మథుర లంబాడా కుటుంబాలు సర్వేను బహిష్కరించాయి. విషయం తెలుసుకుని బాన్స్‌వాడ సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి సోమవారం మండలంలోని పెద్ద దేవిసింగ్‌తండాకు వెళ్లి తండావాసులతో చర్చించి సర్వేకు సహకరించాలని చెప్పారు. అయినా వారు అందుకు ఒప్పుకోలేదు. జాబితాలో 240 కులాల పేర్లలో తమ కులం పేరు మధుర అని ఉందని, అది సరికాదని కిరణ్మయికి విన్నవించారు. తమ కులం పేరు మథుర లంబాడా, కాయితా లంబాడా, లబానా లంబాడాగా ఉండాలని, ఇలా లేనికారణంగా సర్వేలో పాల్గొనబోమని తేల్చి చెప్పారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని సబ్‌ కలెక్టర్‌ చెప్పినా వారు సర్వేకు ఒప్పుకోలేదు.


దాంతో మండలంలోని టికారాం, కుబ్యానాయక్‌, పోచారం, చావునితాండా, రాములు నాయక్‌, జగన్నాథపల్లి, అంజనీ, కొడ్‌పగల్‌,మన్సూర్‌రాం, సముందర్‌తాండ,ధర్మపురి తాండాల పరిధిలో సర్వే నిలిచిపోయింది. మరోవైపు సోమవారం ఖమ్మం నగరంలో సమగ్ర సర్వే స్టిక్కర్‌ను ఇంటికి బదులు ఓ కారుకు అంటించడం చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని 1,68,875 నివాసాలకు స్టిక్కరింగ్‌ కార్యక్రమం సోమవారం పూర్తయింది. 58వ డివిజన్‌లో ఎం రాధాకృష్ణ అనే వ్యక్తి ఇంటి మొదటి అంతస్థులో ఉంటున్నారు. అయితే సర్వే సిబ్బంది తన నివాసానికి కాకుండా పార్కింగ్‌ లోని తన కారుకు సర్వే స్టిక్కర్‌ అంటించి వెళ్లారని రాధాకృష్ణ ఫోన్‌లో ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఘటనపై స్పందించిన ఖమ్మం కేఎంసీ ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ శ్రీజ.. ఘటనపై విచారణ జరిపి సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - Nov 12 , 2024 | 04:27 AM