ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Warangal: 12 గంటల నరకయాతన

ABN, Publish Date - Sep 02 , 2024 | 03:35 AM

భారీ వర్షం, ఉరుములు, మెరుపులు.. కళ్లెదుట రోడ్డుపై పొంగి ప్రవహిస్తోన్న నీళ్లు.. ఉన్న చోట నుంచి కదల్లేని పరిస్థితి.. తిండి లేదు, నిద్ర లేదు.. రెప్ప పడితే రేపటిని చూస్తామో లేదో తెలియని భయం..

  • నెక్కొండలో వరద నీటిలో ఆర్టీసీ బస్సు

  • రాత్రంతా అందులోనే 46 మంది

  • వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు

  • శనివారం రాత్రి నుంచి అందులోనే 46 మంది

  • లారీ డ్రైవర్‌ సాయంతో సురక్షిత ప్రాంతానికి

  • వరంగల్‌ జిల్లా నెక్కొండలో ఘటన

నెక్కొండ, సెప్టెంబరు 1 : భారీ వర్షం, ఉరుములు, మెరుపులు.. కళ్లెదుట రోడ్డుపై పొంగి ప్రవహిస్తోన్న నీళ్లు.. ఉన్న చోట నుంచి కదల్లేని పరిస్థితి.. తిండి లేదు, నిద్ర లేదు.. రెప్ప పడితే రేపటిని చూస్తామో లేదో తెలియని భయం.. వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామ శివారులో వరద నీటిలో చిక్కుకుపోయిన ఓ ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులకు ఎదురైన భయానక అనుభవం ఇది. డ్రైవర్‌, కండక్టర్‌తోపాటు 46 మంది ప్రయాణికులు ఒకటి, రెండు కాదు 12 గంటలకు పైగా ఈ నరకయాతన అనుభవించారు. ఓ లారీ డ్రైవర్‌ చేసిన సాహసంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. శనివారం రాత్రి వేములవాడ నుంచి మహబూబాబాద్‌కు బయలుదేరిన ఆర్టీసీ బస్సులో డ్రైవర్‌, కండక్టర్‌తోపాటు 25 మంది మహిళలు, 10మంది పురుషులు, 11 మంది చిన్నారులు ఉన్నారు.


అయితే, భారీ వర్షాలకు మార్గమధ్యలోని తోపనపల్లి చెరువుకు వరద పోటెత్తగా రాత్రి పది గంటల సమయంలో ఆ బస్సు వెంకటాపురం శివారులో వరద నీటిలో నిలిచిపోయింది. చీకటికి తోడు వర్షం వల్ల డ్రైవర్‌ బస్సును నడిపే ధైర్యం చేయలేకపోయాడు. దీంతో ప్రయాణికులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సాయం కోసం ప్రయత్నిస్తూ ఎదురుచూశారు. ఈ విషయం తెలిసి నెక్కొండ పోలీసులు, వెంకటాపురం ప్రజలు ఘటనా స్థలికి చేరుకున్నా వరదను దాటి బస్సు వద్దకు చేరుకోలేకపోయారు. అర కిలోమీటర్‌ దూరంలోనే ఆగిపోయిన పోలీసులు.. దూరం నుంచే ప్రయాణికులకు దైర్యం చెప్పారు. ఇక, ఆదివారం ఉదయం రైల్వే సిమెంట్‌ స్తంభాల లోడుతో నెక్కొండలో నిలిచిన లారీని చూసిన పోలీసులు సాయం కోసం డ్రైవర్‌తో మాట్లాడారు.


దీంతో రంగంలోకి దిగిన సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన లారీ డ్రైవర్‌ రాము తన లారీని చాకచక్యంగా బస్సు వద్దకు తీసుకెళ్లాడు. ప్రయాణికులను లారీలో ఎక్కించుకుని ఒడ్డుకు చేర్చాడు. ఆ బస్సు ఇప్పటికీ వరదలోనే ఉంది. ఇక, ఆదివారం ఉదయం ఘటనా స్థలికి చేరుకున్న జిల్లా కలెక్టర్‌ సత్యశారద, ఎమ్మెల్యే మాధవ రెడ్డి.. ప్రయాణికులను వెంకటాపురం పాఠశాలకు తరలించి అల్పాహారం, దుస్తులు అందించారు. అనంతరం నెక్కొండలోని ఓ పాఠశాలలో ప్రయాణికులందరికీ భోజనం అందించిన తర్వాత ఇళ్లకు పంపించారు. అలాగే, ప్రయాణికులను రక్షించిన లారీ డ్రైవర్‌ రామును కలెక్టర్‌ అభినందించారు.

Updated Date - Sep 02 , 2024 | 03:35 AM

Advertising
Advertising