ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Corruption: ఏసీబీలో లీకు వీరులు..!

ABN, Publish Date - Sep 10 , 2024 | 03:24 AM

అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)లో లీకు వీరుల వ్యవహారం మరోమారు కలకలం రేపింది. రైడ్‌కు వెళ్లడానికి ముందే..

  • దాడుల విషయం ముందే చేరవేత

  • ఏసీబీ పేరుతో ప్రైవేటు వ్యక్తుల బెదిరింపు వసూళ్లు

హైదరాబాద్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)లో లీకు వీరుల వ్యవహారం మరోమారు కలకలం రేపింది. రైడ్‌కు వెళ్లడానికి ముందే.. అవినీతి ఉద్యోగులకు దాడుల విషయాన్ని ముందే చెబుతుండడంతో వారు అప్రమత్తమవుతున్న దాఖలాలను ఏసీబీ ఉన్నతాధికారులు గుర్తించారు. కొంతకాలంగా వరుసదాడులతో అవినీతి అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న ఏసీబీలో లీకుల అంశం చర్చనీయాంశమవుతోంది. ఇటీవల ఈ విషయాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు బాధ్యులైన ఓ ఇన్‌స్పెక్టర్‌, మరొకరిని సొంత విభాగానికి బదిలీ చేశారు.


గతంలో కూడా ఈ తరహా లీకులు ఇచ్చిన వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నట్లు ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ప్రైవేటు వ్యక్తులు ఏసీబీ కేసుల పేరుతో ప్రభుత్వోద్యోగులను బెదిరించి, అందినకాడికి దండుకుంటుండడం ఆ శాఖకు ఇబ్బందికరంగా మారింది. కొద్ది రోజులక్రితం వరంగల్‌ జిల్లాలో ఓ అధికారికి ఫోన్‌ చేసి.. ఏసీబీ ప్రధాన కార్యాలయం నుంచి ఇన్‌స్పెక్టర్‌ మాట్లాడుతున్నానని, కేసు నుంచి తప్పించాలంటే రూ. 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ శివార్లలో ఏకంగా.. ఏసీబీ పేరు చెప్పి.. వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

Updated Date - Sep 10 , 2024 | 03:24 AM

Advertising
Advertising