ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

(NH-163): హైదరాబాద్‌-విజయవాడ హైవేపై.. 17 బ్లాక్‌ స్పాట్లు

ABN, Publish Date - May 28 , 2024 | 03:32 AM

హైదరాబాద్‌-విజయవాడ (ఎన్‌హెచ్‌-163) జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణ చర్యలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. జూన్‌ 4న రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల కోడ్‌ ముగియగానే పనులు ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ సహా పనుల బాధ్యతను ఎన్‌హెచ్‌ఏఐ ఓ ఏజెన్సీకి అప్పగించింది.

  • చౌటుప్పల్‌-నవాబ్‌పేట జంక్షన్‌ మధ్య గుర్తించిన అధికారులు

  • రూ.288 కోట్ల వ్యయంతో అండర్‌పాస్‌ల నిర్మాణం,

  • రోడ్ల వెడల్పు తదితర పనులు

  • ఓ ఏజెన్సీకి పనుల బాధ్యత

  • ఎన్నికల కోడ్‌ ముగియగానే ప్రారంభం

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌-విజయవాడ (ఎన్‌హెచ్‌-163) జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణ చర్యలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. జూన్‌ 4న రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల కోడ్‌ ముగియగానే పనులు ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ సహా పనుల బాధ్యతను ఎన్‌హెచ్‌ఏఐ ఓ ఏజెన్సీకి అప్పగించింది. ఇందులో భాగంగా చౌటుప్పల్‌ నుంచి నవాబ్‌పేట జంక్షన్‌ వరకు గుర్తించిన 17 బ్లాక్‌ స్పాట్లలో 10 చోట్ల అండర్‌ పాస్‌లను నిర్మించనున్నారు.


అండర్‌పా్‌సలు, రోడ్ల వెడల్పు, సూచిక బోర్డులు సహా పనుల నిర్వహణకు రూ.288 కోట్ల మేర నిధులను వెచ్చించనున్నారు. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై గతంలో సర్వే చేసిన జాతీయ రహదారుల సంస్థ.. మొత్తం మార్గంలో 17 చోట్ల అధికంగా ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించింది. తక్షణమే ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలకు ఉపక్రమించింది. అయితే మూడు, నాలుగేళ్లవుతున్నా.. ఇప్పటికీ ఆ ప్రక్రియ పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో గతంలో ఒకసారి పనుల నిర్వహణ కోసం టెండర్లను ఆహ్వానించింది.


అయితే ఆ పనులన్నీ ఒకే సంస్థకు దక్కడంపై పలు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. దాంతో ఆ టెండర్లను రద్దు చేశారు. అప్పటి నుంచి ఆ అంశం పెండింగ్‌లో ఉండిపోయింది. ఇటీవల ఆర్‌ అండ్‌ బీ శాఖకు మంత్రిగా వచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అటు కేంద్రంతో, ఇటు రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారుల సంస్థతో చర్చలు జరిపి.. 17 బ్లాక్‌స్పాట్లలో చేపట్టాల్సిన పనులను త్వరితగతిన ప్రారంభించాలని కోరారు. ఫలితంగా ఆ పనుల నిర్వహణకు లైన్‌ క్లియర్‌ అయింది.


10 అండర్‌ పాస్‌లు ఇవే..

1) చౌటుప్పల్‌, 2) పెద్దకాపర్తి, 3) చిట్యాల 4) టేకుమట్ల, 5) జనగామ క్రాస్‌, 6) ఎస్వీ కాలేజ్‌ 7) సూర్యాపేట ఫ్లై ఓవర్‌ ముగిసే చోట (విజయవాడ వెళ్లే మార్గంలో) 8) ముకుందాపురం 9) కొమరబండ క్రాస్‌ రోడ్‌ 10) రామాపురం క్రాస్‌ రోడ్‌.


ఇతర ఏర్పాట్లు..

  • కట్టంగూర్‌ దగ్గర జంక్షన్‌ అభివృద్ధి, హైవే లైటింగ్‌తో పాటు, సూచిక బోర్డుల ఏర్పాటు ుఽ ఇనుపాముల దగ్గర ఉన్న సర్వీస్‌ రోడ్‌ విస్తరణ ుఽ ధూర్జపల్లి దగ్గర ఉన్న జంక్షన్‌ అభివృద్ధితో పాటు మరో రహదారి నిర్మాణం, సూచిక బోర్డు ఏర్పాటు ుఽ ఆకుపాముల, నవాబ్‌పేట వెళ్లే మార్గాల దగ్గర ఉన్న జంక్షన్ల అభివృద్ధి, సూచిక బోర్డుల ఏర్పాటు.

Updated Date - May 28 , 2024 | 03:32 AM

Advertising
Advertising