Vikarabad: సినీ నటుడు అలీకి నోటీసులు..
ABN, Publish Date - Nov 25 , 2024 | 03:52 AM
ప్రముఖ సినీ నటుడు మొహ్మద్ అలీకి వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం ఎకమామిడి పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అలీకి ఎకమామిడి గ్రామ పంచాయతీ రెవెన్యూ పరిధి సర్వే నెం.345లో వ్యవసాయ క్షేత్రం ఉంది.
నవాబుపేట, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీ నటుడు మొహ్మద్ అలీకి వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం ఎకమామిడి పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అలీకి ఎకమామిడి గ్రామ పంచాయతీ రెవెన్యూ పరిధి సర్వే నెం.345లో వ్యవసాయ క్షేత్రం ఉంది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఆ వ్యవసాయ క్షేత్రంలో అలీ నిర్మాణాలు చేపడుతున్నారని అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు ఏమైనా ఉంటే తమకు సమర్పించాలని పేర్కొంటూ ఎకమామిడి పంచాయతీ కార్యదర్శి శోభారాణి ఈ నెల 5న తొలిసారిగా నోటీసులు జారీ చేశారు. అలీ నుంచి స్పందన లేకపోవడం, నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో 22వ తేదీన మరోసారి నోటీసులు జారీ చేశారు. అలీకి చెందిన వ్యవసాయ క్షేత్రంలోని సిబ్బందికి వాటిని అందజేశారు. మూడు రోజుల్లోగా స్పందించకుంటే పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Updated Date - Nov 25 , 2024 | 03:52 AM