TG News: చేతులపై మోస్తూ.. పరీక్షలు రాయిస్తూ..
ABN, Publish Date - Mar 22 , 2024 | 01:23 PM
నిర్మల్ జిల్లా: చిన్నప్పుడే పోలియో కారణంగా దివ్యాంగుడైన తన కొడుకును ఎలాగైనా విద్యావంతుడిగా చూడాలని ఆ తల్లి కలలు కంది. అందుకోసం చిన్నప్పటి నుంచి కొడుకును తన చేతుల మీదుగా తీసుకువెళ్లి చదివించింది. ఇప్పుడు తన కొడుకు పదో తరగతి పరీక్షలు రాస్తుండడంతో ఆ తల్లి ప్రతిరోజూ తన కొడుకును ఎత్తుకుని పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్ళి పరీక్ష రాయిస్తుంది.
నిర్మల్ జిల్లా: చిన్నప్పుడే పోలియో (Polio) కారణంగా దివ్యాంగుడైన(Disabled) తన కొడుకును ఎలాగైనా విద్యావంతుడిగా(Educated) చూడాలని ఆ తల్లి కలలు కంది. అందుకోసం చిన్నప్పటి నుంచి కొడుకును తన చేతుల మీదుగా తీసుకువెళ్లి చదివించింది. ఇప్పుడు తన కొడుకు పదో తరగతి (10th) పరీక్షలు (Exams) రాస్తుండడంతో ఆ తల్లి ప్రతిరోజూ తన కొడుకును ఎత్తుకుని పరీక్షా కేంద్రానికి (Examination Centre) తీసుకువెళ్ళి పరీక్ష రాయిస్తుంది. నిర్మల్ జిల్లా (Nirmal Dist.), సారంగపూర్ మండలానికి చెందిన చరణ్ (Charan)కు పుట్టుకతోనే పోలియో సోకింది. దీంతో చిన్నప్పుడే రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. చేతుల కదలికలు కూడా కోల్పోయాడు. అంతేకాదు.. చరణ్‌కు 15 నెలలు ఉండగానే తండ్రి మరణించాడు. దీంతో తల్లి పద్మ (Padma) అప్పటి నుంచి పుట్టింట్లో ఉంటూ బీడి కార్మికురాలిగా పని చేస్తూ కొడుకును చదివించుకుంటోంది. చిన్నప్పటి నుంచి చరణ్‌కు చదువుపై ఆసక్తి ఉండడంతో కష్టమైనా ఆ తల్లి కుమారుడిని చదివించింది. ప్రస్తుతం చరణ్ పదో తరగతి పరీక్షలు రాస్తుండడంతో తల్లి కుమారుడిని తీసుకుని ఆటోలో జిల్లా కేంద్రానికి వస్తుంది. ఎదిగిన కొడుకుని చేతలతో మోస్తూ పరీక్షా కేంద్రానికి తీసుకువెళుతోంది. తన కొడుకు కోసం ఆ తల్లి పడుతున్న కష్టాన్ని చూసి అక్కడున్నవారు అభినందిస్తున్నారు.
Updated Date - Mar 22 , 2024 | 01:28 PM