ఘనంగా సీపీఐ వందేళ్ళ వేడుకలు
ABN, Publish Date - Dec 26 , 2024 | 10:57 PM
సీపీఐ వందేళ్ళ ఆవిర్భావ వేడుకలను జిల్లా కేంద్రంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ కేక్ కట్ చేసి పంచి పెట్టారు. ఆయన మాట్లాడుతూ సీపీఐ ప్రజలు, కార్మికులు, రైతుల సమ స్యల పరిష్కారం పోరాటాలు చేస్తుందన్నారు.
మంచిర్యాల కలెక్టరేట్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): సీపీఐ వందేళ్ళ ఆవిర్భావ వేడుకలను జిల్లా కేంద్రంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ కేక్ కట్ చేసి పంచి పెట్టారు. ఆయన మాట్లాడుతూ సీపీఐ ప్రజలు, కార్మికులు, రైతుల సమ స్యల పరిష్కారం పోరాటాలు చేస్తుందన్నారు. ఈ నెల 30న నల్లగొండ జిల్లాలో జరిగే పార్టీ ఆవిర్భావ ప్రారంభోత్సవ బహిరంగ సభ ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు. నాయకులు చంద్రశేఖర్, మల్లయ్య, రవి, నగేష్, పౌలు, పోచన్న, శంకరయ్య, పోశం, రాయమల్లు పాల్గొన్నారు.
బెల్లంపల్లి, (ఆంధ్రజ్యోతి): సీపీఐ వందేళ్ళ ఉత్సవాలను సీపీఐ కార్యాల యంలో నిర్వహించారు. రాష్ట్ర సమితి సభ్యులు బొల్లం పూర్ణిమ, మిట్టప ల్లి వెంకటస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్పనర్సయ్యలు జెండాను ఆవిష్కరించారు. సీపీఐ ప్రజల సమస్యల పరిష్కారం, హక్కుల సాధ నకు అనేక పోరాటాలు చేసిందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. బాబు, లక్ష్మీనారాయణ, చంద్రమాణిక్యం, ఉపేందర్, రాజేష్, సోని, సరోజ, రాజం పాల్గొన్నారు.
నస్పూర్, (ఆంధ్రజ్యోతి): సీపీఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నస్పూర్ కాలనీ, గోదావరి కాలనీ, నాగార్జు కాలనీల్లో అరుణ పతాకాలను ఎగురవేశారు. నస్పూర్‌కాలనీ, నాగార్జునకాలనీల్లో మిర్యాల రాజేశ్వర్ రావు, కంచం పోశంలు, షిర్కే సెంటర్‌లో కలవేన శంకర్‌లు ఎగురవే శారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్ మాట్లాడుతూ సీపీఐ పేద ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. జిల్లా కార్యదర్శి రామ డుగు లక్ష్మన్, మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, నాయకులు రవి, రేగుంట చంద్రశేఖర్, కారుకూరి నగేష్, బాజీ సైదా పాల్గొన్నారు.
కాసిపేట, (ఆంధ్రజ్యోతి): సీపీఐ ఆవిర్భావ వేడుకలను మండల కేం ద్రంలో నిర్వహించారు. మండల కార్యదర్శి దాగం మల్లేష్ సీపీఐ జెండా ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారం, హక్కుల సాధనకు సీపీఐ నిరంతరం పోరాటాలు చేస్తుందన్నారు. గట్టయ్య, దాగం రాజలింగు, సత్తయ్య, దుర్గం పోచం, సుధాకర్, పాల్గొన్నారు.
Updated Date - Dec 26 , 2024 | 10:57 PM