ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అమృత్‌ 2.0 పథకంతో మున్సిపాలిటీల అభివృద్ధి

ABN, Publish Date - Dec 19 , 2024 | 11:17 PM

అమృత్‌ 2.0 పథకంతో జిల్లాలోని మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతాయని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంచిర్యాల మున్సిపాలిటీ సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌కు చేపట్టిన ఏరియల్‌ సర్వేను జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఆయన ప్రారంభించి మాట్లాడారు. మంచిర్యాల మున్సిపాలిటీ ప్రాంతంలో నివాస, వాణిజ్య, వ్యవసాయ భూముల గుర్తింపు, అభివృద్ధికి డ్రోన్‌ ద్వారా ఏరియల్‌ సర్వే చేపట్టినట్లు చెప్పారు.

మంచిర్యాల కలెక్టరేట్‌, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): అమృత్‌ 2.0 పథకంతో జిల్లాలోని మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతాయని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంచిర్యాల మున్సిపాలిటీ సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌కు చేపట్టిన ఏరియల్‌ సర్వేను జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఆయన ప్రారంభించి మాట్లాడారు. మంచిర్యాల మున్సిపాలిటీ ప్రాంతంలో నివాస, వాణిజ్య, వ్యవసాయ భూముల గుర్తింపు, అభివృద్ధికి డ్రోన్‌ ద్వారా ఏరియల్‌ సర్వే చేపట్టినట్లు చెప్పారు. నివేదిక అందిన అనంతరం మాస్టర్‌ ప్లాన్‌లో మార్పులు చేసి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మార్చేందుకు ప్రతిపాదనలు ఉన్నందున డ్రోన్‌ ఏరియల్‌ సర్వే ద్వారా భూముల సమాచారం సేకరిస్తామని చెప్పారు. జడ్పీ సీఈవో గణపతి, జిల్లా షెడ్యూల్డ్‌ కులముల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు పోటు రవీందర్‌ రెడ్డి, జిల్లా సంక్షేమాధికారి రౌఫ్‌ఖాన్‌, జిల్లా యువజనులు, క్రీడల అభివృద్ధి అధికారి కీర్తి రాజ్‌వీరు, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి, మున్సిపల్‌ కమిషనర్‌ మారుతి ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

క్రీడలతో జీవితంలోనూ రాణింపు : కలెక్టర్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే జీవితంలోనూ రాణిస్తారని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. సీఎం కప్‌-2024 క్రీడల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో చెస్‌ ఆటను ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో దేహదారుఢ్యం పెంపొందుతుందని, మానసిక ఉల్లాసం కలుగుతుందని, విద్య, ఉపాధి రంగాలలో రాణించేందుకు ఏకాగ్రత ఏర్పడుతుందన్నారు. గెలుపోటములను సమానంగా తీసుకొని క్రీడాస్ఫూర్తితో ముందుకుసాగాలని సూచించారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ చూపిన వారిని ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో జరుగనున్న పోటీలకు ఎంపిక చేస్తామని అన్నారు. జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి కీర్తి రాజ్‌వీరు, జిల్లా షెడ్యూల్డ్‌ కులాల కార్పొరేషన్‌ ఈడీ దుర్గా ప్రసాద్‌, జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్‌, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 19 , 2024 | 11:17 PM