విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
ABN, Publish Date - Dec 23 , 2024 | 10:55 PM
విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్క రించాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్, పెండింగ్ స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని డి మాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదు ట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అభినవ్, బండి సత్య నారాయణ, ద్యాగం శ్రీకాంత్‌లు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయిం బర్స్‌మెంట్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
నస్పూర్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్క రించాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్, పెండింగ్ స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని డి మాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదు ట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అభినవ్, బండి సత్య నారాయణ, ద్యాగం శ్రీకాంత్‌లు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయిం బర్స్‌మెంట్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు నాయకులను అదుపులోకి తీసు కుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని విద్యార్థులు అఽధికారికి అందించారు. నాయకులు నిఖిల్, సాయి, రాజ్ కుమార్, శ్రావణి, సౌజన్య పాల్గొన్నారు.
ప్రభుత్వ భూమిలో పేదలకు ఇండ్లు కేటాయించాలి
జన్నారం మండలం చింతగూడ సర్వే నంబరు 81లోని ప్రభుత్వ భూమిలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించింది. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయ ఏవో రాజేశ్వర్‌రావుకు అందించారు. నాయ కులు మాట్లాడుతూ ప్రభుత్వ భూమి అక్రమణకు గురవుతుందన్నారు. భూమిని సర్వే చేయించి అర్హులైన పేదలకు కేటాయించాలన్నారు. శ్రీనివాస్, లాల్‌కుమార్, బ్రహ్మనందం, మల్లయ్య, పాల్గొన్నారు.
Updated Date - Dec 23 , 2024 | 10:55 PM