లెదర్ పార్కు స్థలానికి హద్దులు పెట్టండి
ABN, Publish Date - Nov 06 , 2024 | 10:57 PM
పట్టణంలోని ప్రాణహిత కాలనీ సమీ పంలో గల లెదర్ పార్కు మధ్యలో నుంచి వేసి న రోడ్డును నిలిపివేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సింగరేణి అధికారులను ఆదేశించారు. బుధవారం లెదర్ పార్కును సంద ర్శించారు.
మందమర్రి టౌన్, నవంబరు 6 (ఆంధ్ర జ్యోతి): పట్టణంలోని ప్రాణహిత కాలనీ సమీ పంలో గల లెదర్ పార్కు మధ్యలో నుంచి వేసి న రోడ్డును నిలిపివేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సింగరేణి అధికారులను ఆదేశించారు. బుధవారం లెదర్ పార్కును సంద ర్శించారు. సింగరేణి అధికారులు, కేకే 1 గ్రూపు ఏజెంట్ రాందాస్‌తో కలిసి పార్కు మ్యాప్‌ను పరిశీలించారు. సింగరేణి, రెవెన్యూ సంయుక్త సర్వే నిర్వహించి లెదర్ పార్కుకు కేటాయించిన 25 ఎకరాలకు హద్దులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరి శ్రమలను ప్రారంభించడానికి ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన పేర్కొన్నారు.
కేసీఆర్ కుంభకోణాలపై విచారణ చేపట్టాలి
బీఆర్‌ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం చేసి న కుంభకోణాలపై విచారణ చేపట్టాలని ముఖ్య మంత్రిని కోరానని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. పలు వార్డుల్లో ఆయన మార్నింగ్ వాక్ నిర్వహించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని వినతిపత్రాలు స్వీకరించారు. అనం తరం విలేకరులతో మాట్లాడుతూ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబం అభివృద్ధిలో అందనంత స్థాయికి చేరుకుందన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ ఫెల్యూర్ లీడర్ అని, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానం గెల వలేదన్నారు. కుటుంబ సర్వేపై ప్రతిప క్షాల విమర్శలు విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. ఇంటింటి సర్వేతోనే సామాజిక వర్గాల చేయూత, అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
లెదర్ పార్కు భూమి కాపాడాలి
మందమర్రిరూరల్ (ఆంధ్రజ్యోతి): లెదర్ పార్కు స్థలాన్ని కాపాడాలని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దళిత సంఘాల నాయకులు వినతిపత్రం అం దించారు. సోలార్ పవర్ ప్లాంటు కాం ట్రాక్టర్, మేనేజర్ లెదర్ పార్కు భూమి ని ఆక్రమించారన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎంతో మాట్లాడి లెదర్ పార్కు ప్రారంభమయ్యేలా చూస్తానని తెలిపారు. రూ. 20 లక్షల డీఎంఎఫ్‌టీ నిదులతో ప్రహరీ ఏర్పాటు చేయి స్తా నని తెలిపారు. నాయకులు విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ఎదుట నాయకుల వాగ్వాదం
జైపూర్ (ఆంధ్రజ్యోతి): ఇందారంలో ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి ఎదుటే మండల కాంగ్రెస్ నాయకులు బుధవారం వాగ్వాదానికి దిగారు. డీఎంఎఫ్‌టీ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసేందుకు ఎమ్మెల్యే, కలెక్టర్ కుమార్ దీపక్‌ల ఎదుటే నాయకులు దూషించుకున్నారు. కార్యక్ర మం గురించి పార్టీ మండల అధ్యక్షుడు ఫయాజ్ సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యేకు కాంగ్రెస్ నాయకుడు జక్కుల వెంకటేశం ఫిర్యాదు చేశారు. దీంతో ఫయాజ్ స్పందిస్తూ కార్యక్రమంపై ప్రతీ ఒక్కరికి వాట్సాప్ ద్వారా మెసెజ్ చేశానని తెలి పారు. ఒకరికొకరు తోసుకోవడంతో సీఐ వేణుచం దర్ ఇరువర్గాలను సముదాయించారు. అసహ నం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఎస్సీ కాలనీలో మరో కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నా వెళ్లిపోయారు. నర్వ గ్రామంలో డీఎంఎఫ్‌టీ నిధుల ద్వారా నిర్మించనున్న సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ పనులకు కలెక్టర్‌తో కలిసి భూమి పూజ చేశారు.
ఎల్‌వోసీ అందజేసిన ఎమ్మెల్యే
భీమారం (ఆంధ్రజ్యోతి): సుంకరిపల్లి గ్రామా నికి చెందిన సెగ్యం లక్ష్మీ అనారోగ్యంతో బాధప డుతుండగా ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి రూ.1.75 లక్షల ఎల్‌వోసీని బాధితురాలు ఇంటికి వెళ్లి ఎల్‌వోసీని అందజేశారు.
Updated Date - Nov 06 , 2024 | 10:57 PM