క్రీడలను జీవితంలో భాగం చేసుకోవాలి
ABN, Publish Date - Dec 26 , 2024 | 10:55 PM
క్రీడల ను ప్రతీ ఒక్కరు వారి జీవితంలో భాగం చేసుకో వాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. మూడు రోజు లుగా పట్టణంలోని తిలక్ మైదానంలో నిర్వహిస్తున్న 9వ జాతీయ సాఫ్ట్ బేస్‌బాల్ చాంపియన్ షిప్ పోటీ లు గురువారం ముగిశాయి. విజేతల బహుమతి కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజర య్యారు.
బెల్లంపల్లి, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): క్రీడల ను ప్రతీ ఒక్కరు వారి జీవితంలో భాగం చేసుకో వాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. మూడు రోజు లుగా పట్టణంలోని తిలక్ మైదానంలో నిర్వహిస్తున్న 9వ జాతీయ సాఫ్ట్ బేస్‌బాల్ చాంపియన్ షిప్ పోటీ లు గురువారం ముగిశాయి. విజేతల బహుమతి కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజర య్యారు. ఆయన మాట్లాడుతూ క్రీడలు ప్రతీ ఒక్క రికి శారీరకంగా మానసికంగా ధృఢంగా ఉండడానికి దోహదం చేస్తాయన్నారు. క్రీడలు క్రమశిక్షణను పెం పొందిస్తాయన్నారు. క్రీడల్లో రాణిస్తే ప్రభుత్వ ఉద్యో గాలు సైతం వచ్చే అవకాశాలు ఉంటాయన్నారు. అనంతరం పోటీల్లో విజేతలైన సబ్ జూనియర్ బాలురు, బాలికల విభాగాల్లో కేరళ, అలాగే యూత్ మహిళ, పురుషుల విభాగంలో కేరళ జట్లు విజేతగా నిలిచాయి. గెలిచిన జట్లకు కలెక్టర్ ట్రోఫీలు అం దజేశారు. రాష్ట్ర సాఫ్ట్ బేస్‌బాల్ అధ్యక్షుడు రవికు మార్, ప్రధాన కార్యదర్శి గురువేందర్, ట్రెజరర్ దివా కర్, జిల్లా త్రోబాల్ సెక్రటరీ యాదండ్ల బలరాం, నాయకులు నాతరి స్వామి, మునిమంద రమేష్, వివిధ రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్నారు.
-క్రీడల్లో రాణించిన జట్లు
9వ జాతీయ స్థాయి సాఫ్ట్ బేస్‌బాల్ పోటీల్లో సబ్ జూనియర్ బాలుర విభాగంలో మొదటి స్ధానంలో కేరళ, ద్వితీయ మహారాష్ట్ర, తృతీయ తెలంగాణ నిలి చింది. సబ్ జూనియర్ బాలికల విభాగంలో ప్రథమ కేరళ, ద్వితీయ తెలంగాణ, తృతీయ మధ్యప్రదేశ్ జట్లు నిలిచాయి. యూత్ పురుషుల విభాగంలో ప్రథ మ కేరళ, ద్వితీయ తెలంగాణ, తృతీయ మధ్యప్రదేశ్ జట్లు నిలిచాయి. యూత్ మహిళవిభాగంలో ప్రథమ కేరళ, ద్వితీయ తెలంగాణ, తృతీయ మధ్యప్రదేశ్ జట్లు నిలిచాయి.
జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో రాణించాలి
గర్మిళ్ల, (ఆంధ్రజ్యోతి): సీఎం కప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో రాణించాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. ఈ నెల 27వ తేదీ కరీంన గర్, వరంగల్, హైద్రాబాద్‌లలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా నుంచి ఎంపికైన క్రీడాకారు లు బయలుదేరుతున్న బస్సులను గురువారం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానం నుంచి జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ, మండల, మున్సిపల్ జిల్లా స్థాయిల్లో వివిధ క్రీడల్లో పోటీలను నిర్వహించి ప్రతిభ కనబ ర్చిన క్రీడాకారులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశామ న్నారు. జిల్లా నుంచి 190 మంది క్రీడాకారులు ఈ నెల 27వ తేదీ నుంచి జనవరి 2, 2025 జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ పెరుగుతుం దని తెలిపారు. జిల్లా యువజన క్రీడ శాఖ అధికారి రాజ్‌వీరు, అధికారులు దుర్గాప్రసాద్, పురుషోత్తం నాయక్, నీరటి రాజేశ్వరి, రౌఫ్‌ఖాన్ పాల్గొన్నారు.
Updated Date - Dec 26 , 2024 | 10:55 PM