ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మామిడిగూడెంలో వైద్య శిబిరం

ABN, Publish Date - Nov 22 , 2024 | 11:04 PM

మామిడిగూడెంలో జ్వరాలు అదుపులోకి వచ్చే వరకు వైద్య శిబిరాలను కొనసాగించాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ హరీష్‌రాజ్‌ వైద్య సిబ్బందికి సూచించారు. మామిడిగూడెంలో జ్వరాలు ప్రబలి ప్రజలు మంచాన పడ్డారనే వార్త గురువారం ఆంధ్ర జ్యోతిలో ప్రచురితమైంది. స్పందించిన జిల్లా యంత్రాంగం మామిడిగూ డెంలో వైద్య శిబిరం నిర్వహించారు.

కాసిపేట, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): మామిడిగూడెంలో జ్వరాలు అదుపులోకి వచ్చే వరకు వైద్య శిబిరాలను కొనసాగించాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ హరీష్‌రాజ్‌ వైద్య సిబ్బందికి సూచించారు. మామిడిగూడెంలో జ్వరాలు ప్రబలి ప్రజలు మంచాన పడ్డారనే వార్త గురువారం ఆంధ్ర జ్యోతిలో ప్రచురితమైంది. స్పందించిన జిల్లా యంత్రాంగం మామిడిగూ డెంలో వైద్య శిబిరం నిర్వహించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ప్రజ లు పరిసరాల పరిశుభ్రతతోపాటు వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచిం చారు.

62 మందికి వైద్య పరీక్షలు చేసి మందులను అందజేశామని, 12 మంది రక్త నమూనాలను సేకరించామన్నారు. ఇంటింటికి వెళ్లి ర్యాపిడ్‌ ఫీవర్‌ సర్వే నిర్వహించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఉప వైద్యాధికారి డాక్టర్‌ సుధాకర్‌ నాయక్‌, కాసిపేట మెడికల్‌ ఆఫీసర్‌ కిరణ్‌, సబ్‌ యూనిట్‌ అధికారులు శ్రీనివాస్‌, పర్యవేక్షకులు నాందేవ్‌, జిల్లా మాస్‌ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్‌, వెంకటసాయి పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2024 | 11:04 PM