ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పొరపాట్లు లేకుండా స్పష్టంగా నమోదు చేయాలి

ABN, Publish Date - Dec 20 , 2024 | 10:43 PM

ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని 1, 4, 11, 20 వార్డుల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రావు, చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేతతో కలిసి పరిశీలించారు.

బెల్లంపల్లి, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని 1, 4, 11, 20 వార్డుల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రావు, చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేతతో కలిసి పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్లకు అందిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టమన్నారు. ప్రభుత్వం నిరుపేదలకు గూడు కల్పించాలనే ఉద్దేశ్యంతో ఇందిరమ్మ ఇండ్లను అందిస్తుందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల యాప్‌లో పొరపాట్లు లేకుండా స్పష్టంగా వివరాలను నమోదు చేయాలన్నారు. అధికారులు నిర్ణీత గడువులోగా కేటాయించిన ప్రకారం లక్ష్యాన్ని పూర్తి చేసే విధంగా కృషి చేయాలన్నారు.

కన్నెపల్లి, (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియ పకడ్బం దీగా చేపట్టాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. జజ్జరవెల్లి, కన్నెపల్లి, జన్కాపూర్‌ గ్రామాల్లో కొనసాగుతున్న సర్వేను కలెక్టర్‌ పరిశీలించారు. ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్న దరఖాస్తుదారుల వివరాలను ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ ఇండ్ల యాప్‌లో పొరపాట్లు లేకుం డా స్పష్టంగా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. జజ్జరవెల్లి ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు కామన్‌ మెనూ ప్రకారం పోషక విలువలు గల ఆహారం అందించాలని సూచిం చారు. వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలన్నారు. ఎంపీడీవో శంకర్‌, ఉపాధ్యాయులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

మందమర్రిరూరల్‌, (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పక డ్బందీగా నిర్వహించాలని జెడ్పీ సీఈవో గణపతి పేర్కొన్నారు. సండ్రోన్‌పల్లిలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పరిశీలిం చారు. సర్వే సిబ్బందికి ప్రజలు సహకరించాలని పేర్కొన్నారు. ఎంపీడీ వో రాజేశ్వర్‌, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు. అందుగులపేటలో ఎంపీడీవో రాజేశ్వర్‌ ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పరిశీలించారు.

Updated Date - Dec 20 , 2024 | 10:43 PM