భీమారం చేరుకున్న ప్రజారగ్ జోల్ యాత్ర
ABN, Publish Date - Dec 22 , 2024 | 10:28 PM
సామాజిక న్యాయం, రాజ్యాధికారం లక్ష్యంతో కొనసాగుతున్న ప్రజారగ్ జోల్ యాత్ర ఆదివారం భీమారం చేరుకుంది. సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబునాయక్, సెంట్రల్ కమిటీ చైర్మన్ ప్రేమ్‌చంద్‌నాయక్, జిల్లా అధ్యక్షుడు గుగులోత్ మల్లేష్ నాయక్ అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేశారు.
భీమారం, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): సామాజిక న్యాయం, రాజ్యాధికారం లక్ష్యంతో కొనసాగుతున్న ప్రజారగ్ జోల్ యాత్ర ఆదివారం భీమారం చేరుకుంది. సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబునాయక్, సెంట్రల్ కమిటీ చైర్మన్ ప్రేమ్‌చంద్‌నాయక్, జిల్లా అధ్యక్షుడు గుగులోత్ మల్లేష్ నాయక్ అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేశారు. వారు మాట్లాడుతూ సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా గిరిజనులపై జరుగుతున్న భౌతిక దాడులను అరికట్టాలన్నారు. ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఈ యాత్ర ఈ నెల 26 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. నాయకులు పంతుల, రాజ్‌కుమార్ నాయక్, సుధాకర్‌నాయక్, రఘురాం రాధోడ్, రేఖ్యానాయక్, దేవేందర్‌నాయక్, మహేందర్, రవి రాధోడ్, శంకర్‌నాయక్ తదిత రులు పాల్గొన్నారు.
అనంతరం సేవాలాల్ సేన మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షు డిగా భుక్య మోతిలాల్, గౌరవాధ్యక్షుడు హరి లాల్‌నాయక్, ప్రధాన కార్యదర్శిగా మహాన్ లాల్, వర్కింగ్ ప్రెసిడెం ట్‌గా దస్రునాయక్, ఉపాధ్యక్షులుగా శంకర్‌నా యక్‌లను ఎన్నుకున్నారు.
Updated Date - Dec 22 , 2024 | 10:28 PM