ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
ABN, Publish Date - Dec 23 , 2024 | 11:01 PM
ప్రజావాణిలో అం దిన దరఖాస్తులను అధికారులు సమన్వయంతో త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆర్డీవోలు శ్రీని వాసరావు, హరికృష్ణలతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. వేలాల శివారు ఇసుక క్వారీలో అవకతవకలు నెలకొన్నాయని జాడి యేసయ్య దరఖాస్తు అందజేశారు.
మంచిర్యాల కలెక్టరేట్, డిసెంబర్ 23(ఆంధ్రజ్యోతి): ప్రజావాణిలో అం దిన దరఖాస్తులను అధికారులు సమన్వయంతో త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆర్డీవోలు శ్రీని వాసరావు, హరికృష్ణలతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. వేలాల శివారు ఇసుక క్వారీలో అవకతవకలు నెలకొన్నాయని జాడి యేసయ్య దరఖాస్తు అందజేశారు. మంచిర్యాల పట్టణంలోని రాంనగర్‌కు చెందిన బొమ్మకంటి శ్రీనివాస్ భూమి వివరాలు ధరణిలో నమోదు చేసి పట్టాదారు పాస్ పుస్త కం మంజూరు చేయాలన్నారు. దండేపల్లి మండలం రాజంపేటకు చెందిన జాడి కళ్యాణ్ చక్రవర్తి లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట శివారులో వారసత్వంగా వచ్చిన భూమిని కొందరు ఆక్రమించుకొన్నారని, న్యాయం చేయాలని అర్జీ సమర్పించారు. తాండూర్ మండలం కాసిపేటకు చెందిన సుంకరి విక్రమ్ తండ్రి పేరిట భూమిని కొందరు ఆక్రమించుకొన్నారని, న్యాయం చేయాలని కోరారు. అధికారులు పాల్గొన్నారు.
నీటి సంరక్షణ పనుల వివరాలు నమోదు చేయాలి
జల శక్తి అభియాన్ కింద జిల్లాలో చేపట్టిన నీటి సంరక్షణ పనులకు సంబంధించిన వివరాలను శాఖల వారీగా జల్ సంచాయ్ పోర్టల్‌లో నమోదు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టర్‌లో మున్సిపల్, అటవీ శాఖ అధికారులతో జల శక్తి అభియాన్ కార్యక్రమం కింద చేపట్టిన పనులపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జల శక్తి అభియాన్ కింద జల్ సంచాయ్ - జన్ భగీరథి కార్యక్రమంలో భాగంగా మార్చి నుంచి చేపట్టిన పనులకు సంబంధించి శాఖల వారీగా ప్రభుత్వం వివరాలు సేకరించి పోర్టల్‌లో నమోదు చేయాలని, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్ సమన్వయకర్తగా వ్యవహరిస్తారని తెలిపారు.
Updated Date - Dec 23 , 2024 | 11:01 PM