ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హడలెత్తిస్తున్న బెబ్బులి

ABN, Publish Date - Dec 19 , 2024 | 11:20 PM

మంచిర్యాల, కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో బెబ్బులి హడలెత్తిస్తోంది. పాత మంచిర్యాల అటవీ సెక్షన్‌ పరిధిలోని పాత మంచిర్యాల, ముల్కల్ల బీట్‌లోని అడవిలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు ధ్రువీకరించారు. ప్రజలు, పశువుల కాపర్లు, అడవిలోకి వెళ్లవద్దని, ఎలాంటి విద్యుత్‌ వైర్లు అమర్చకూడదని సూచించారు.

మంచిర్యాల/హాజీపూర్‌, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల, కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో బెబ్బులి హడలెత్తిస్తోంది. పాత మంచిర్యాల అటవీ సెక్షన్‌ పరిధిలోని పాత మంచిర్యాల, ముల్కల్ల బీట్‌లోని అడవిలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు ధ్రువీకరించారు. ప్రజలు, పశువుల కాపర్లు, అడవిలోకి వెళ్లవద్దని, ఎలాంటి విద్యుత్‌ వైర్లు అమర్చకూడదని సూచించారు. అలాగే పత్తి ఏరడానికి వెళ్లే మహిళలు గుంపులుగా వెళ్లాలని సూచించారు. క్వారీ గుట్టల్లో ఏర్పాటు చేసిన సఫారీ రోడ్డుపై పులి సంచరిస్తుండగా బుధవారం ట్రాకింగ్‌ కెమెరాకు చిక్కింది. ఇటీవల మగ పులి హాజీపూర్‌ మండలంలో సంచరించగా ప్రస్తుతం కెమెరాకు చిక్కింది ఆడపులిగా అధికారులు పేర్కొన్నారు. కాగా అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలు పరిశీలించిన అధికారులు పెద్దపులివిగా నిర్ధారించారు. పులి సంచారంతో అటవీ సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఆర్‌వో సుభాష్‌ మాట్లాడుతూ ప్రజలు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఒంటరిగా అడవి సమీపంలోకి, పత్తిచేన్లలోకి వెళ్లవద్దని సూచించారు. కార్యక్రమంలో సెక్షన్‌ అధికారి అతహుల్లా, బీట్‌ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

గుండాయిపేటలో పులి సంచారం

కౌటాల, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలం గుండాయిపేట పరిధిలో వార్దా నది పరివాహాక ప్రాంతంలో గురువారం పులి సంచరించింది. గుండాయిపేటకు చెందిన రైతు నవీన్‌ తన మిర్చి తోట దగ్గరికి వెళ్లగా పులి కన్పించడంతో కేకలు వేస్తూ తోటి రైతులను అప్రమత్తం చేశాడు. దీంతో ఆ ప్రాంతంలోని రైతులు బిగ్గరగా కేకలు వేశారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పులి అడుగులను గుర్తించారు. ఎఫ్‌డీవో వినయ్‌కుమార్‌ సాహు ఆధ్వర్యంలో సిబ్బంది పులి అడుగుల ద్వారా ఏ వైపు వెళ్లిందనే విషయాన్ని గుర్తించేందుకు యత్నిస్తున్నారు. పత్తి ఏరేందుకు కూలీలు గుంపులుగా వెళ్లాలని అధికారులు చెబుతున్నారు. ఉదయం 10 గంటల తర్వాతనే చేలలోకి వెళ్లాలని, సాయంత్రం నాలుగు గంటల లోపు ఇళ్లలోకి చేరుకోవాలని సూచించారు. కాగా ఈ పులి మహారాష్ట్రలోని చెప్రాడ అభయారణ్యం నుంచి రెండు నదులను దాటుకుంటూ వచ్చినట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర ప్రాంతంలో కూడా పులి అడుగులు గుర్తించినట్లు సమాచారం. నది పరివాహాక ప్రాంతాలైన తాటిపెల్లి, పార్డి, సాండ్‌గాం, వీర్ధండి, గుండాయిపేట, తుమ్డిహేట్టి ప్రాంతాల్లో పులి తిరిగే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు ప్రకటించారు. దీంతో కౌటాల ఎస్సై మఽధుకర్‌ ఆధ్వర్యంలో గ్రామాల్లో చాటింపు వేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

Updated Date - Dec 19 , 2024 | 11:20 PM