Share News

ప్రభుత్వ సహకారంతో లాభాల బాటలో ఆర్టీసీ

ABN , Publish Date - Dec 05 , 2024 | 11:01 PM

నష్టాల బాటలో నడిచే ఆర్టీసీ సంస్థ కాంగ్రెస్‌ ప్రభుత్వ సహకారంతో లాభాల బాటలో పయనిస్తోందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో నిర్వహించిన ప్రజా ప్రభుత్వంలో సకల జనుల సంబురం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ప్రభుత్వ సహకారంతో లాభాల బాటలో ఆర్టీసీ

మంచిర్యాల అర్బన్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): నష్టాల బాటలో నడిచే ఆర్టీసీ సంస్థ కాంగ్రెస్‌ ప్రభుత్వ సహకారంతో లాభాల బాటలో పయనిస్తోందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో నిర్వహించిన ప్రజా ప్రభుత్వంలో సకల జనుల సంబురం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంస్థను లాభాల్లో నడిపించేందుకు ప్రభుత్వ సహకారం ఎంత ఉందో ఉద్యోగులు, సిబ్బంది కృషి అంతే ఉం దన్నారు.

గత యేడాది ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ఆర్టీసీ సంస్థ ఆర్థికంగా బలపడేందుకు దోహదం చేసిందన్నారు. డిపో పరిధిలో ఇప్పటిరకు 1.30 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసు కున్నారన్నారు. మంచిర్యాల డిపోకు గడిచిన 8 నెలల్లో రూ.8కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. బస్‌స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని డిపో మేనేజర్‌ జనార్దన్‌ ఎమ్మెల్యేకు విన్నవించగా ఆయన సానుకూలంగా స్పందించారు. అసిస్టెంట్‌ డిపో మేనేజర్‌ దేవపాల, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 05 , 2024 | 11:01 PM