కలెక్టరేట్ ఎదుట రెండో ఏఎన్‌ఎంల నిరసన
ABN, Publish Date - Dec 19 , 2024 | 11:22 PM
కొన్నేళ్ళుగా పని చేస్తున్న తమకు రాత పరీక్ష పెట్టాలన్నా విధానాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం కలెక్టరేట్ ఎదుట తెలంగాణ వైద్య ఆరోగ్య ఉద్యోగ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో రెండో ఏఎన్‌ఎంలు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రెండు రోజుల నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
నస్పూర్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): కొన్నేళ్ళుగా పని చేస్తున్న తమకు రాత పరీక్ష పెట్టాలన్నా విధానాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం కలెక్టరేట్ ఎదుట తెలంగాణ వైద్య ఆరోగ్య ఉద్యోగ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో రెండో ఏఎన్‌ఎంలు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రెండు రోజుల నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గురువారం రాత్రి 7 గంటల వరకు నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ నెల 29న నిర్వహించే ఎంపీహెచ్‌ఏ రాత పరీక్షను నిలిపివేయాలని నినాదాలు చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పద్మ మాట్లాడుతూ ఏఎన్‌ఎంలు, ఈసీ, ఆర్‌సీఎం, హెచ్‌ఆర్‌డి, అర్బన్, అవుట్ సోర్సింగ్ వివిధ స్కీముల్లో 20 సంవత్సరాల నుంచి పని చేస్తున్నామన్నారు. 45 నుంచి 50 సంవత్సరాల వయస్సుపైబడిన వారు పోటీ పరీక్ష రాసే పరిస్థితి లేదన్నారు. తమకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా రెగ్యులరైజ్ చేయాలన్నారు. సత్యవతి, స్వరూప, సుగుణ పాల్గొన్నారు.
ఫ జిపీఎస్ విధానాన్ని విరమించాలి.
అంగన్‌వాడీ ఉద్యోగులకు జీపీఎస్ యాప్ ద్వారా రోజు ఫొటోలు పెట్టాలనే నిర్ణయాన్ని విరమించుకోవాలని అంగన్‌వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో గురువారం స్ర్తీ శిశు సంక్షేమశాఖ అధికారికి వినతిపత్రం అందించారు. యూనియన్ అధ్యక్షురాలు భానుమతి, సీఐటీయు నాయకులు రమణ, రంజిత్, ప్రకాష్, అంగన్‌వాడీ యూనియన్ నాయకులు పద్మావతి, సంధ్యారాణి, సునిత, శారధ, చంద్రకళ, సబితా, అనురాధ, శ్రీలత, అదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 19 , 2024 | 11:22 PM