ఒంటికాలిపై నిల్చొని... నిరసన తెలిపి
ABN, Publish Date - Dec 26 , 2024 | 10:53 PM
నస్పూర్‌లో కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె గురువారం నాటికి 18వ రోజుకు చేరుకుంది. ఉద్యోగులు శిబిరంలో ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన చేస్తామని జేఏసీ అధ్యక్షురాలు సుమలత, ప్రధాన కార్యదర్శి రాజన్నలు వెల్లడించారు.
నస్పూర్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): నస్పూర్‌లో కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె గురువారం నాటికి 18వ రోజుకు చేరుకుంది. ఉద్యోగులు శిబిరంలో ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన చేస్తామని జేఏసీ అధ్యక్షురాలు సుమలత, ప్రధాన కార్యదర్శి రాజన్నలు వెల్లడించారు. శిబిరాన్ని డె మోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) జిల్లా అధ్యక్షుడు రమేష్, ప్రధాన కార్యదర్శి జయప్రకాష్, నాయకులు శ్రీనివాస్, జాకీర్, టీఎస్‌యుటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చక్రపాణి, ప్రధాన కార్యదర్శి రాజావేణు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపి ఆర్థిక సహాయాన్ని అందించారు.
గర్మిళ్ల, (ఆంధ్రజ్యోతి): కస్తూర్బా పాఠశాలలకు ఉపాధ్యా యుల డిప్యూటేషన్ ఆదేశాలను విరమించుకోవాలని రాష్ర్టోపాధ్యాయ సం ఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు, బాపులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమగ్ర శిక్ష అభియాస్ ఉద్యోగులు 18 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ఉద్యోగులను చర్చలకు పిలువకుండా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై కస్తూర్బా పాఠశాలలకు పంపించే ఉత్త ర్వులు జారీ చేయడం సరి కాదన్నారు.
చెన్నూరు, (ఆంధ్రజ్యోతి): సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్య లను పరిష్కరించాలని తపస్ జిల్లా అధ్యక్షుడు సయింపు శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో జరిగిన సమా వేశంలో ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో పనిచేస్తూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉద్యోగాలను క్రమబద్దీకరించా లని, ఆరోగ్యబీమా, కనీస వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు బాధ్యతలను కేటాయించడాన్ని ఖం డిస్తున్నామని, దీని వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నారు. నాయకు లు సింగిరెడ్డి సాంబయ్య, తోడె తిరుపతి, చందు, సురేష్ పాల్గొన్నారు.
Updated Date - Dec 26 , 2024 | 10:53 PM