ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలు బోధించాలి

ABN, Publish Date - Nov 20 , 2024 | 10:27 PM

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్యాంశాలు అర్ధమయ్యే రీతిలో బోధించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. బుధవారం పట్ట ణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. కలెక్టర్‌ మాట్లా డుతూ చదువులో వెనకబడి ఉన్న విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

బెల్లంపల్లి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్యాంశాలు అర్ధమయ్యే రీతిలో బోధించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. బుధవారం పట్ట ణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. కలెక్టర్‌ మాట్లా డుతూ చదువులో వెనకబడి ఉన్న విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విధుల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి కార్యాచరణ ప్రకా రం ముందుకు వెళ్లాలని సూచించారు. మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలన్నారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థులను పలు విషయాలను అడిగి తెలుసు కున్నారు. అనంతరం పట్టణంలోని పలు వార్డుల్లో కొనసాగుతున్న సర్వేను పరిశీలించారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లు లేకుండా కుటుంబీకుల వివ రాలు నమోదు చేయాలన్నారు. ఆర్డీవో హరికృష్ణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మద్దతు ధరపై పత్తి కొనుగోలు చేయాలి

తాండూర్‌ (ఆంధ్రజ్యోతి): జిన్నింగు మిల్లు లకు వచ్చే పత్తిని మద్దతు ధరపై కొనుగోలు చేయాలని, తేమ శాతం ఆధారంగా చెల్లింపులు చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అధికారులకు సూచించారు. రేపల్లెవాడలోని జిన్నింగు మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పత్తి 8 శాతం తేమ ఉంటే క్వింటాలుకు రూ.7521 వస్తుందని, 8 నుంచి 12 శాతం వరకు పెరిగే ఒక్కో శాతానికి రూ.75 చొప్పున క్వింటాలుకు మద్దతు తగ్గుతుం దని తెలిపారు. రైతులకు పొలాల వద్దే తేమ శాతం పరిక్షించుకునేందుకు చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. గ్రామాల్లో అదనంగా తేమ శాతం యంత్రాలను ఏర్పాటు చేయాలన్నారు. మిల్లులో పత్తి ప్రాసెసింగ్‌, ప్యాకింగ్‌ తీరును పరి శీలించారు. తహసీల్దార్‌ ఇమ్రాన్‌ఖాన్‌, డీటీ ప్రసాద్‌, ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 10:27 PM