ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhadradri : అయ్యయ్యో.. తల్లులకు ఎంత కష్టం

ABN, Publish Date - Sep 17 , 2024 | 01:39 AM

సరైన రోడ్లు, రవాణా సదుపాయాలు లేనికారణంగా భద్రాది కొత్తగూడెం జిల్లాలోని ఆదివాసీ ప్రాంత ప్రజలు ముఖ్యంగా గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

  • ఆదివాసీ మహిళల ప్రసవ యాతన

  • రోడ్లు సరిగా లేకపోవడంతో గర్భిణులను జెడ్డీలపై మోసుకెళ్తున్న వైనం

  • చర్ల మండలంలో ఒకే రోజు రెండు ఘటనలు

చర్ల, సెప్టెంబర్‌ 16: సరైన రోడ్లు, రవాణా సదుపాయాలు లేనికారణంగా భద్రాది కొత్తగూడెం జిల్లాలోని ఆదివాసీ ప్రాంత ప్రజలు ముఖ్యంగా గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చర్ల మండలంలో సోమవారం చోటుచేసుకున్న రెండు హృదయ విదారకర ఘటనలే ఇందుకు నిదర్శనం. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఇద్దరు మహిళలను గ్రామస్థులు జెడ్డి కట్టి సుమారు 8 కిలోమీటర్లు భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు. బట్టిగూడెం గ్రామానికి చెందిన ఇద్దరు నిండు గర్భిణులు సుబ్బమ్మ, రవ్వా దేవిలకు ఆదివారం రాత్రి నుంచే పురిటి నొప్పులు మొదలయ్యాయి.


దీంతో గ్రామస్థులు. కుటుంబ సభ్యులు వారిని ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. రోడ్లు సరిగ్గా లేకపోవడంతో జెడ్డీలు కట్టి 8 కిలోమీటర్లు మోసుకెళ్లి తిప్పాపురానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆటోలో సత్యనారాయణపురం వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం వారికి అక్కడ చికిత్స అందిస్తున్నారు. కొంతకాలంగా భద్రాద్రి ఏజెన్సీలో పలువురు ఆదివాసీ మహిళలు ఇలా ప్రసవ సమయంలో నరకయాతన అనుభవిస్తున్నారు. జెడ్డీలు కడితేనేగానీ ఆసుపత్రులకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కాగా, నెల రోజుల వ్యవధిలో నలుగురు మహిళలను ఈవిధంగా జెడ్డీలపై మోసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు.

Updated Date - Sep 17 , 2024 | 01:39 AM

Advertising
Advertising