Rain: బీ అలర్ట్ ..హైదరాబాద్‌లో కాసేపట్లో మళ్లీ వర్షం
ABN, Publish Date - May 16 , 2024 | 06:16 PM
హైదరాబాద్(Hyderabad)లో 6 గంటల తర్వాత మళ్లీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. ఈ క్రమంలో ఉద్యోగం నుంచి ఇంటికి వెళ్లే వారు వర్షం, ట్రాఫిక్ తీవ్రతను చూసుకుని ప్లాన్ చేసుకొని వెళ్లాలని అధికారులు సూచించారు.
హైదరాబాద్(Hyderabad)లో 6 గంటల తర్వాత మళ్లీ వర్షం(rains) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. ఈ క్రమంలో ఉద్యోగం నుంచి ఇంటికి వెళ్లే వారు వర్షం, ట్రాఫిక్ తీవ్రతను చూసుకుని ప్లాన్ చేసుకొని వెళ్లాలని అధికారులు సూచించారు. గత కొన్ని గంటలుగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు పెద్ద ఎత్తున చేరింది. దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ సిబ్బంది నీటిని క్లియర్ చేస్తున్నారు.
మరోవైపు గడిచిన గంట సేపట్లో 70కి పైగా ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు. దీంతోపాటు ఏదైనా ప్రాంతాల్లో సమస్యలు ఉంటే GHMC కంట్రోల్ రూం 040-21111111, 9000113667 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.
ఇక కొద్ది సేపటిక్రితం అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురియగా, సికింద్రాబాద్‌లో అత్యధికంగా 9.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మలక్ పేటలో 8.4, బంజారాహిల్స్ వేంకటేశ్వర కాలనీలో 8.3, బేగం బజార్‌లో 8.1, గోల్కొండలో 7.5, కృష్ణా నగర్‌లో 7.45, అస్మాన్ ఘడ్‌లో 7.3, బంజారాహిల్స్, గోల్కొండలో 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి...
TS News: అలర్ట్.. అలర్ట్.. మరో ఐదు రోజులు వర్షాలు..!!
Prathipati Pullarao: పల్నాడు హింసకు కారణాల్లో పోలీసుల తీరుపైనే అనుమానాలు
Read Latest Telangana News AND Telugu News
Updated Date - May 16 , 2024 | 06:31 PM