ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Medical Education: వయో పరిమితి పెంపు బిల్లుకు మోక్షం

ABN, Publish Date - Jul 30 , 2024 | 04:31 AM

వైద్య విద్య సంచాలకుడి పరిఽధిలో విభాగాధిపతి(అడ్మినిస్ట్రేటివ్‌) పోస్టుల వయో పరిమితి పెంపు బిల్లుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సంబంధిత ఫైల్‌పై ఇంచార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఆదివారం సంతకం చేసినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి.

  • 61 ఏళ్ల నుంచి 65కు పెంపునకు గవర్నర్‌ ఆమోదం

  • వైద్య విద్యలో విభాగాధిపతి పోస్టులపై వీడిన చిక్కుముడి

  • వారంలో రెగ్యులర్‌ వైద్య విద్య సంచాలకుడి నియామకం?

హైదరాబాద్‌, జూలై 29(ఆంధ్రజ్యోతి): వైద్య విద్య సంచాలకుడి పరిఽధిలో విభాగాధిపతి(అడ్మినిస్ట్రేటివ్‌) పోస్టుల వయో పరిమితి పెంపు బిల్లుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సంబంధిత ఫైల్‌పై ఇంచార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఆదివారం సంతకం చేసినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి. దీంతో రాష్ట్రంలో వైద్య విద్య కళాశాలలు, అనుబంధ ఆస్పత్రులకు విభాగాధిపతుల నియామకం సులభం కానుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులు, వైద్య విద్య సంచాలకుల (డీఎంఈ) కార్యాలయంలో 69 రెగ్యులర్‌ పోస్టులున్నాయి. వీటిలో 17 మందే రెగ్యులర్‌ అదనపు డీఎంఈలున్నారు. మిగిలిన అన్నింటా ఇంచార్జిలే. ఆ పోస్టులను భర్తీ చేయాలనే ఉద్దేశంలో ప్రభుత్వం పదోన్నతులకు సిద్ధమైంది.


ఐదేళ్లు ప్రొఫెసర్‌గా పనిచేసినవారి జాబితాను రూపొందించింది. 150 పేర్లతో జాబితాను వైద్య శాఖ సర్కారుకు పంపింది. కానీ, విభాగాధిపతి పోస్టుల్లో ఉండేవారి విరమణ వయసు పెంపు బిల్లు ఆమోదం కాకుండా పదోన్నతులు చేపట్టలేమని సాధారణ పరిపాలన శాఖ స్పష్టం చేసింది. దీంతో కొద్ది నెలలుగా ప్రక్రియ నిలిచిపోయింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉండగా అదనపు డీఎంఈల విరమణ వయసును 61 ఏళ్ల నుంచి 65కు పెంచారు. సంబంధిత బిల్లుకు శాసనసభ ఆమోదం అనంతరం గవర్నర్‌ ఆమోదానికి పంపారు. అప్పటి గవర్నర్‌ తమిళిసై తిరస్కరించారు.


రెండోసారీ పంపగా.. ఏ నిర్ణయమూ తీసుకోలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరి, తమిళిసై వెళ్లిపోయాక.. ఇంచార్జి గవర్నర్‌గా వచ్చిన రాధాకృష్ణన్‌ను వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పలుసార్లు కలిసి విభాగాధిపతుల వయో పరిమితి పెంపు బిల్లు గురించి వివరించారు. మరిన్ని వివరాలివ్వాలని కోరిన ఆయన.. అవి సమర్పించిన తర్వాత ఆమోద ముద్ర వేశారు. ఆగస్టు తొలి వారంలో రెగ్యులర్‌ డీఎంఈ నియామకంపై కోర్టు కేసు విచారణ ఉంది. బిల్లుకు ఆమోదంతో వారంలోపే రెగ్యులర్‌ డీఎంఈ నియామక ప్రక్రియను చేపట్టే అవకాశం ఉందని వైద్య శాఖ వర్గాలు తెలిపాయి.

Updated Date - Jul 30 , 2024 | 04:31 AM

Advertising
Advertising
<