ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dr. Nageshwar Reddy: ఫాస్ట్‌ ఫుడ్స్‌తో పిల్లలకు పెను ముప్పు

ABN, Publish Date - Oct 31 , 2024 | 03:51 AM

చిప్స్‌, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, పిజ్జా, బర్గర్‌ వంటి ఫాస్ట్‌ఫుడ్స్‌, అలా్ట్ర ప్రాసెస్డ్‌, జంక్‌ ఫుడ్స్‌తో పిల్లల ఆరోగ్యానికి పెనుప్రమాదం ఉందని.. ఏఐజీ ఆస్పత్రి చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

చిప్స్‌, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, పిజ్జా, బర్గర్‌ వంటి ఫాస్ట్‌ఫుడ్స్‌, అలా్ట్ర ప్రాసెస్డ్‌, జంక్‌ ఫుడ్స్‌తో పిల్లల ఆరోగ్యానికి పెనుప్రమాదం ఉందని.. ఏఐజీ ఆస్పత్రి చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బడి ఈడు పిల్లల్లోనూ ఫ్యాటీ లివర్‌, గ్యాస్ట్రిక్‌ సమస్యలు నమోదవుతున్నాయని.. పదేళ్ల క్రితం జనాభాలో ఐదు శాతం మేర ఉన్న ఫ్యాటీ లివర్‌ కేసుల సంఖ్య 35 శాతానికి పెరిగిందని ఆవేదన వెలిబుచ్చారు. ఈ అంశంపై ‘ఆంధ్రజ్యోతి’కి డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు..

  • పదేళ్ల వయసులోనే ఫ్యాటీ లివర్‌

  • 5 నుంచి 35%కి గ్యాస్ట్రిక్‌ కేసులు

  • పల్లెల్లోనూ మారిన ఆహారపుటలవాట్లు

  • ఇష్టారాజ్యంగా యాంటాసిడ్స్‌ వాడొద్దు

  • మితిమీరిన మద్యపానంతో కాలేయం

  • దెబ్బతింటున్న కేసులు భారీగా పెరిగాయి

  • ఏఐజీ ఆస్పత్రి చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): చిప్స్‌, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, పిజ్జా, బర్గర్‌ వంటి ఫాస్ట్‌ఫుడ్స్‌, అలా్ట్ర ప్రాసెస్డ్‌, జంక్‌ ఫుడ్స్‌తో పిల్లల ఆరోగ్యానికి పెనుప్రమాదం ఉందని.. ఏఐజీ ఆస్పత్రి చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బడి ఈడు పిల్లల్లోనూ ఫ్యాటీ లివర్‌, గ్యాస్ట్రిక్‌ సమస్యలు నమోదవుతున్నాయని.. పదేళ్ల క్రితం జనాభాలో ఐదు శాతం మేర ఉన్న గ్యాస్ట్రిక్‌ కేసుల సంఖ్య 35 శాతానికి పెరిగిందని ఆవేదన వెలిబుచ్చారు. ‘‘దశాబ్దకాలంలో ఏ జబ్బూ ఈ స్థాయిలో పెరగలేదు. హృద్రోగాలు, మధుమేహం లాంటివి కూడా కేవలం 15 శాతం పెరిగాయే తప్ప...ఈ స్థాయిలో పెరగలేదు. మన ఆహారపుటలవాట్లను మార్చుకోకుండా, జాగ్రత్తలు తీసుకోకుండా ఇలాగే వ్యవహరిస్తే.. మరో పదేళ్ల తర్వాత ఫ్యాటీ లివర్‌, గ్యాస్ట్రిక్‌ సమస్యల కేసులు 60 శాతానికి పెరిగే ప్రమాదం లేకపోలేదు. పాశ్చాత్య దేశాల్లో ఈ సమస్య ఈ స్థాయిలో లేదు. ఎందుకంటే వాళ్లు బయట తీసుకునే ఆహారపదార్థాలు హానికలిగించే ప్రిజర్వేటివ్స్‌ లేకుండా చూసుకుంటున్నారు’’ అని ఆయన పేర్కొన్నారు.


  • ఫాస్ట్‌ ఫుడ్స్‌, జంక్‌ ఫుడ్స్‌తో ఆరోగ్యంపై ఎలాంటిప్రభావం పడుతుంది?

ప్రస్తుతం అంతా వయసుతో సంబంధం లేకుండా ఫాస్ట్‌ఫుడ్‌, జంక్‌ ఫుడ్‌ను ఎక్కువగా తీసుకుంటున్నారు. వాటిలో ఉండే అధిక కెలోరీల వల్ల కొవ్వు పెరిగి అనారోగ్యానికి దారితీస్తుంది. అంతేకాదు.. వాటిని నిల్వ చేయడానికి వాడే పిజర్వేటివ్స్‌, అడిటివ్స్‌, కృత్రిమ రంగుల వల్ల క్రమేపీ మన కడుపులో మంచి బ్యాక్టీరియా పోయి చెడు బ్యాక్టీరియా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ చెడ్డ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే కొన్ని హానికర ఉత్పత్తులు శరీరమంతా వ్యాపించి గుండె, మెదడు సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. కాలేయంపై ప్రభావం పడి ఫ్యాటీ లివర్‌ సమస్య వస్తుంది. ఇటీవలికాలంలో పాఠశాల విద్యార్థుల్లో కూడా ఫ్యాటీ లివర్‌ సమస్య ఎక్కువగా కనపడడానికి కారణం ఇదే. చాలామంది పిల్లలు.. ఎక్కువగా అలా్ట్ర ప్రాసెస్డ్‌ ఫుడ్‌ను తిసుకుంటున్నారు. బర్గర్లు, పిజ్జాలు, చిప్స్‌ ఎక్కువగా తినేస్తున్నారు. దీంతో పదేళ్ల పిల్లల్లోనూ ఫ్యాటీ లివర్స్‌ కేసులు వస్తున్నాయి. వారు గ్యాస్ట్రిక్‌ సమస్యలతో బాధపడుతున్నారు. అలాగే.. మన దగ్గర మద్యం సంబంధిత కాలేయ వ్యాధుల సంఖ్య గత పదేళ్లలో బాగా పెరిగింది. ఆస్పత్రుల్లో 50ు కాలేయ సమస్యల కేసులు ఆల్కహాల్‌ సంబంధించినవే ఉంటున్నాయి. మద్యపానం వల్ల కాలేయం, గుండె, నాడులు, ఉదర భాగాలు దెబ్బతింటాయి. ఇలాంటి కేసుల్లో కాలేయ మార్పిడి శస్త్రచికిత్సతో సమస్య తీరదు. మద్యం మానాల్సిందే.


  • పల్లెల్లోనూ జంక్‌ఫుడ్‌ సంస్కృతి పెరిగింది కదా.. అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి?

మా ఆస్పత్రి ఆధ్వర్యంలో పల్లెల్లో కూడా సర్వేలు చేశాం. పల్లె ప్రజల్లో ఎక్కువగా అల్సర్స్‌, ఇరిటబుల్‌ బొవెల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌), అజీర్తి వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించాం. అక్కడ కూడా ప్రజలు సహజంగా లభించే ఆహారాన్ని సరిగ్గా తీసుకోవడం లేదు. కూరగాయలు, అన్నం మానేసి ఈ ఫాస్ట్‌ఫుడ్స్‌ ఎక్కువగా తింటున్నారు. చిన్నచిన్న ఊళ్లల్లో కూడా.. చిప్స్‌, రెండు నిమిషాల్లో రెడీ అయ్యే నూడుల్స్‌ లాంటివి విరివిగా కనిపిస్తున్నాయి. దీనికితోడు.. పల్లెల్లో కలుషిత నీటి సమస్య ఎక్కువగా ఉంటుంది. అది కూడా గ్యాస్ట్రిక్‌ సమస్యలకు దారితీస్తోంది. అలా గే.. పల్లెల్లో గతంలోలాగా పొలాలకు వెళ్లడం, శారీరక శ్రమ చేయడం బాగా తగ్గిపోయింది. సరైన శారీరక శ్రమ లేకపోయినా గ్యాస్ట్రిక్‌ సమస్యలు వస్తాయి.


  • ఫాస్ట్‌ ఫుడ్స్‌, స్వీట్స్‌ తయారీలో వాడే పదార్థాల్లో ఏవి అనారోగ్యకరం?

ఫాస్ట్‌ఫుడ్స్‌, జంక్‌ ఫుడ్‌ తయారీలో రకరకాల పదార్థాలు వాడుతున్నారు. మిఠాయిల తయారీలో కృత్రిమ రంగులు వేస్తున్నారు. చక్కెరకు బదులు కృత్రిమ తీపిపదార్థాలు వేసి.. అవి ఆరోగ్యానికి మంచివని చెబుతున్నారు. కానీ అది తప్పు. వాటి వల్ల కూడా దుష్ప్రభావాలు కలుగుతాయి. ఇక నూనెల విషయానికి వస్తే.. అన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ మంచివి. ఆలివ్‌ ఆయిల్‌ వంటివాటిలో ఉంటాయి. శాచురెటెడ్‌ ఫ్యాట్స్‌ అంత మంచివి కావు (కొబ్బరినూనె). ట్రాన్స్‌ఫ్యాట్స్‌ అస్సలు మంచివి కావు (వనస్పతి లాంటివి). కానీ మన బేకరీల్లో ఎక్కువగా ట్రాన్స్‌ఫ్యాట్స్‌నే వాడుతున్నారు. కాబట్టి బేకరీ ఉత్పత్తుల అధిక వినియోగం వల్ల కూడా మన ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది. అలాగే.. కొన్ని టూత్‌పేస్టుల్లో టైటానియమ్‌ ఆక్సైడ్‌ ఉంటుంది. దీనివల్ల శరీరంలోని బ్యాక్టీరియా మార్పులు చెంది దుష్ప్రభావాలు కలుగుతున్నాయి. టూత్‌పే్‌స్టలో ఈ టైటానియమ్‌ ఆక్సైడ్‌ ఉండకూడదు. ప్రభుత్వం దీనిపై దృష్టిసారించాలి.

  • గ్యాస్ట్రిక్‌ సమస్యల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?

ప్రజలు తమ ఆహారపుటలవాట్లలో మార్పులు చేసుకోవాలి. నిత్యం వ్యాయమం చేయాలి. కంటి నిండా నిద్రపోవాలి. ఇలాంటి మార్పులతో జీవనశైలి జబ్బులను అదుపులో పెట్టుకోవచ్చు. మద్యపానానికి దూరంగా ఉండాలి. అన్నింటికంటే పెద్ద చెడ్డ అలవాటు.. పోగతాగడం. దీనివల్ల చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. ఇక ఆహారం విషయానికి వస్తే.. మన దక్షిణాది ఆహారం చాలా మంచిది. ఈ ఆహారాన్ని రోజూ తీసుకోవాలి. దాంతోపాటు చిరుధాన్యాలనూ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఫాస్ట్‌ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ 50 సంవత్సరాలు నిండిన తర్వాత కొన్ని ప్రాథమిక వైద్య పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. అంటే గుండె, మెదడు, లివర్‌ పనితీరుతో పాటు బీపీ, షుగర్‌ స్థాయులు ఎలా ఉన్నాయో పరీక్షించుకోవాలి. వాటి ఆధారంగా జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవాలి.

  • గ్యాస్ట్రిక్‌ సమస్యను ముందుగా గుర్తించి, నివారించదగిన ఔషధాలు అందుబాటులో ఉన్నాయా?

చాలా ఔషధాలు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు ఎసిడిటీ సమస్యకు పీపీఐ (ప్రొటాన్‌ పంప్‌ ఇన్హిబిటర్స్‌) వాడేవాళ్లం. ఇప్పుడు కొత్తగా పీక్యాప్‌ వచ్చింది. దీనివల్ల దుష్ప్రభావాలు చాలావరకూ తగ్గిపోయాయి. మన ఫార్మా రంగం చాలా బలమైనది. పీక్యా్‌పను ఇక్కడే ఎక్కువగా ఉత్పత్తి చేస్తోంది. విదేశాల్లో రూ.100కు దొరికే ట్యాబ్లెట్స్‌ ఇక్కడ మనకు పది రూపాయలకే దొరుకుతున్నాయి. అలాగే లివర్‌ సమస్యలకు కూడా చాలా కొత్త మందులు మనదగ్గరే ముందుగా అందుబాటులోకి వచ్చాయి.


  • ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి?

మనం సహజంగా తినే ఆహారమే మంచిది.. ఫాస్ట్‌ ఫుడ్స్‌ మంచివి కావనే విషయంపై ప్రజల్లో అవగాహన పెంచాలి. అలాగే, కొన్ని కఠిన చర్యలు తీసుకోవాలి. ఉదాహరణకు పాఠశాలలు, కళాశాలల సమీపంలో బార్లు, మద్యం దుకాణాలు ఉండకూడదని నిబంధనలు చెబుతున్నాయి. ఇటువంటి కఠిన నిర్ణయమే ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్స్‌ విషయంలోనూ ప్రభుత్వం తీసుకుంటే మంచిది. స్కూల్స్‌, కాలేజీల్లో, వాటి సమీపంలో ఫాస్ట్‌ఫుడ్‌ విక్రయాలు జరపకుండా చర్యలు తీసుకోవాలి. విదేశాల్లో ఇటువంటి వాటిపై కఠినంగా ఉన్నారు. ఉదాహరణకు.. న్యూయార్క్‌లో ట్రాన్స్‌ఫ్యాట్స్‌ ఉండే ఆహారాన్ని బ్యాన్‌ చేశారు. ఈ ట్రాన్స్‌ఫ్యాట్స్‌ అనేవి బేకింగ్‌ ఫుడ్‌లో వాడకూడదు. బిస్కట్స్‌, కేకుల్లో కూడా ఈ ట్రాన్స్‌ఫ్యాట్‌ ఎక్కువగా ఉంటుంది. మనదగ్గర ఇంకా అటువంటి కఠిన నిబంధనలను అమలు చేయడం లేదు. ఫుడ్స్‌లో ఏం ఉపయోగించాలనే దానిపై కొన్ని నిబంధనలు తీసుకురావాలి.


  • యాంటాసిడ్స్‌ వాడకం మంచిదేనా?

ఈ మధ్యనే ఏది పడితే అది తినేసి.. ఎసిడిటీ వస్తోందని ఎక్కువగా యాంటాసిడ్స్‌ తీసుకుంటున్నారు. ఇది ఏ మాత్రం మంచిది కాదు. యాంటాసిడ్స్‌ అధిక వినియోగం వల్ల ఆమ్లత్వం తగ్గి శరీరంలో చెడ్డ బ్యాక్టీరియా పెరిగిపోతుంది. అల్సర్స్‌ ఉన్నవారు, ఇతరత్రా సమస్యలున్నవారు వైద్యులు సిఫారసు చేస్తే మాత్రమే యాంటాసిడ్స్‌ వాడాలి. అంతే తప్ప ఎలా పడితే అలా మందుల దుకాణాల్లో కొని వాడడం మంచిది కాదు. యాసిడ్‌ కూడా శరీరానికి అవసరమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

Updated Date - Oct 31 , 2024 | 03:52 AM