ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AI technology: మత్తు దరిచేరనివ్వని బాల‘మిత్ర’

ABN, Publish Date - Aug 10 , 2024 | 03:06 AM

ఒకప్పుడు మహానగరాలకు పరిమితమైన మత్తు మహమ్మారి ఇప్పుడు మారుమూల పల్లెలకూ పాకింది. గతంలో కళాశాల విద్యార్థులకే అంతంత మాత్రంగా దొరికే మాదక ద్రవ్యాలు.. ఇప్పుడు పాఠశాల విద్యార్థులకూ సులువుగా అందుబాటులో ఉంటున్నాయి.

  • బడి పిల్లలపై ఏఐ నిఘా నేత్రం

  • 20 స్కూళ్లలో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు

హైదరాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు మహానగరాలకు పరిమితమైన మత్తు మహమ్మారి ఇప్పుడు మారుమూల పల్లెలకూ పాకింది. గతంలో కళాశాల విద్యార్థులకే అంతంత మాత్రంగా దొరికే మాదక ద్రవ్యాలు.. ఇప్పుడు పాఠశాల విద్యార్థులకూ సులువుగా అందుబాటులో ఉంటున్నాయి. దీంతో వయసుతో సంబంధం లేకుండా బడి పిల్లలు కూడా మత్తుకు బానిసవుతున్నారు. గతంలో డ్రగ్స్‌ కేసు దర్యాప్తులో ఎక్సైజ్‌ శాఖ హైదరాబాద్‌లోని పలు పాఠశాలల్లో విద్యార్థులు నిషేధిత మత్తుపదార్థాలను వాడుతున్నట్లు గుర్తించింది. తాజాగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో(టీజీ న్యాబ్‌) తనిఖీల్లోనూ ఇదే విషయం బట్టబయలైంది.


కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌ శివారులోని షాద్‌నగర్‌ ప్రాంతంలో పాఠశాల విద్యార్థులు గంజాయి చాక్లెట్లకు బానిసలైన ఘట న తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే ఇలాంటి వాటిని ఆదిలోనే గుర్తించి అడ్డుకట్ట వేసేందుకు ఇన్ఫర్మేషన్‌ అండ్‌ టెక్నాలజీ(ఐటీ) శాఖ, టీజీ న్యాబ్‌ సంయుక్తంగా ఏఐ సాంకేతికతను వాడుకలోకి తెచ్చాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ‘మిత్ర’ యాప్‌ ద్వారా విద్యార్థులు మత్తు వైపు అడుగులు వేస్తున్నారా..? లేదా..? అనేది గుర్తించే విధానాన్ని తీసుకొచ్చాయి.


ఐటీ శాఖ నూతనంగా తెస్తు న్న ఈ విధానానికి సంబంధించి అనేక కంపెనీలు పోటీపడినప్పటికీ యునైటెడ్‌ ఈ-కేర్‌ కంపెనీతో అధికారులు ఒప్పందం చేసుకున్నారు. పైలట్‌ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని 20 పాఠశాలలను ఎంపిక చేసి ‘మిత్ర’ యాప్‌తో పరీక్షలు నిర్వహించి విజయవంతమయ్యారు. దీంతో ఈ విధానాన్ని తెలంగాణలో వీలైనంత ఎక్కువ స్కూళ్లలో అమలుచేసేందుకు సిద్ధమయ్యారు. ఐటీ, టీజీ న్యాబ్‌ సంస్థలు విద్యాశాఖతో ఒప్పందం చేసుకుని పని చేయనున్నాయి.


  • ఏమిటీ మిత్ర.. ఎలా పనిచేస్తుంది..?

మిత్ర యాప్‌ను పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. దీని ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు వాట్సా్‌పలో 13 ప్రశ్నలు పంపుతారు. ఉదాహరణకు.. మీ అబ్బాయి/అమ్మాయి గదిలో ఎక్కు వ సమయం ఒంటరిగా ఉంటున్నారా? మగతగా ఉంటున్నారా? వారి ప్రవర్తనలో ఏదైనా మార్పు కనిపిస్తోందా? మాట్లాడే విధానం ఎలా ఉంది..? వారిలో అనూహ్యంగా వస్తున్న మార్పులు..? ఈ తరహా ప్రశ్నలు ఉంటాయి. తల్లిదండ్రులు ఇచ్చే సమాధానాల ఆధారంగా పిల్లలు మత్తుకు ఆకర్షితులయ్యారా..? లేదా..? అనేది తేలుస్తారు.


  • అత్యంత రహస్యం..

పిల్లలు మత్తుకు బానిసలయ్యారనే విషయం బయటకు తెలిస్తే ఏమవుతుందోననే భయం సాధారణంగా తల్లిదండ్రుల్లో ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచడంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్‌ నంబర్లు తీసుకునే దగ్గరి నుంచి వారిని ప్రశ్నించడం, పిల్లల పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని అంచనా వేసే వరకు ఎక్కడా వివరాలు బహిర్గతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. తల్లిదండ్రులు ఇచ్చే సమాచారంలో ఏదైనా తేడా ఉందని తేలితే.. వారి అనుమతితోనే రెండోదశలో పిల్లలు చదివే పాఠశాల, కళాశాల నిర్వాహకుల నుంచి ఇదే తరహాలో సమాధానాలు రాబడతారు. అక్కడా వివరాలు గోప్యంగా ఉంటాయి.

Updated Date - Aug 10 , 2024 | 03:06 AM

Advertising
Advertising
<