ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amarpreet Singh: భవిష్యత్‌ యుద్ధాలకు ఏరోస్పేస్‌ కీలకం

ABN, Publish Date - Dec 15 , 2024 | 04:26 AM

భవిష్యత్తులో యుద్ధాలకు గగనతల సైనిక శక్తి, సామర్థ్యాలు(ఏరోస్పేస్‌ పవర్‌) కీలకం కానున్నాయని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌ అన్నారు.

  • ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌

  • దుండిగల్‌లో 214 కోర్సు కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌

అల్వాల్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్తులో యుద్ధాలకు గగనతల సైనిక శక్తి, సామర్థ్యాలు(ఏరోస్పేస్‌ పవర్‌) కీలకం కానున్నాయని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌ అన్నారు. శనివారం దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో నిర్వహించిన 214 కోర్సు కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారత వైమానిక దళం గౌరవాన్ని, సంప్రదాయాలను యువ అధికారులు కాపాడాలన్నారు. కొత్తగా నియమించిన అధికారుల్లో 178 మంది యువకులు, 26 మంది యువతులు ఉన్నారు. మొత్తం 204 మంది గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసుకున్నారు.


ఐఏఎ్‌ఫలో వివిధ శాఖల్లో వీరు చేరారు. మరోవైపు, భారత నావికాదళానికి చెందిన 9 మంది అధికారులు, ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ నుంచి 9 మంది అధికారులు, వియత్నాం పీపుల్స్‌ ఎయిర్‌ఫోర్స్‌ నుంచి ఒకరు ఈ వేడుకల్లో ‘వింగ్స్‌’ అవార్డును అందుకున్నారు. మరోవైపు, భారత వైమానికదళంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆయుధ వ్యవస్థ విభాగం(వెపన్‌ సిస్టమ్‌ బ్రాంచ్‌)లోకి ఈ గ్రాడ్యుయేషన్‌ బృందం నుంచే అధికారులను నియమించారు. పరేడ్‌ తర్వాత, ఎయిర్‌ ఫోర్సు అకాడమీలో ప్రదర్శించిన స్కైడైవింగ్‌, ఎయిర్‌ క్రాఫ్ట్‌ విన్యాసాలు ప్రేక్షకులను అబ్బురపరిచాయి. వాయుసేనకు చెందిన ఎయిర్‌ వారియర్‌ డ్రిల్‌ టీమ్‌ నిర్వహించిన డ్రిల్‌ విశేషంగా ఆకట్టుకొంది.

Updated Date - Dec 15 , 2024 | 04:26 AM