ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Traffic Restrictions: హైదరాబాదీలకు గమనిక.. ఈ ఏరియాలో 16 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు

ABN, Publish Date - Sep 13 , 2024 | 03:09 PM

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 16 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు(Traffic Restrictions) విధించాలని పోలీసులు నిర్ణయించారు.

హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 16 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు(Traffic Restrictions) విధించాలని పోలీసులు నిర్ణయించారు. సైబర్ టవర్స్ ఫ్లైఓవర్ ల్యాండింగ్ నుంచి యశోద హాస్పిటల్ వరకు సర్వీస్ రోడ్డు నిర్మాణ పనుల కారణంగా సెప్టెంబర్ 14 నుంచి 30వ తేదీ వరకు ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు.

ఐటీ కారిడార్‌ మీదుగా ప్రయాణించేవారు సైబర్ టవర్స్, 100 ఫీట్ జంక్షన్, కొత్తగూడ జంక్షన్ నుంచి జేఎన్‌టీయూ, మూసాపేట్ వైపు వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలి.

వివరాలు..

1. టోడీ కాంపౌండ్ నుంచి 100 ఫీట్ జంక్షన్ మీదుగా JNTU, మూసాపేట్ వైపు వచ్చే ట్రాఫిక్ పర్వత్‌నగర్ జంక్షన్ వద్ద మళ్లింపు తీసుకొని ఖైత్లాపూర్ వంతెన మీదుగా వెళ్లవచ్చు.


2. ఐకియా, సైబర్ గేట్‌వే, COD జంక్షన్ నుంచి సైబర్ టవర్స్ ఫ్లైఓవర్ మీదుగా JNTU వైపు వెళ్లే ట్రాఫిక్ నేరుగా జేఎన్టీయూ వైపు కొనసాగుతుంది.

3. సైబర్ టవర్స్ ఫ్లైఓవర్ కింద JNTU వైపు ప్రయాణించే వాహనాలను N-గ్రాండ్ హోటల్ వద్ద మళ్లించవచ్చు. అలా N-కన్వెన్షన్ మీదుగా వెళ్లవచ్చు. ఇవే కాకుండా వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా భాగ్యనగరంలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

For Latest News and National News click here

Updated Date - Sep 13 , 2024 | 03:18 PM

Advertising
Advertising