ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Allu Arjun Release: అల్లు అర్జున్ ఇంటికి సురేఖ.. బన్నీని చూసి కన్నీళ్లు ఆపుకోలేక..

ABN, Publish Date - Dec 14 , 2024 | 11:24 AM

Allu Arjun Release: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారు. మధ్యంతర బెయిల్ మీద విడుదలైన బన్నీ.. జైలు నుంచి ఇంటికి వెళ్లిపోయారు. దీంతో ఆయన కోసం సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు.

Allu Arjun Release: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారు. మధ్యంతర బెయిల్ మీద విడుదలైన బన్నీ.. జైలు నుంచి ఇంటికి వెళ్లిపోయారు. దీంతో ఆయన కోసం సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు. ‘పుష్ప’ నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్‌ బన్నీని కలిశారు. ఆ తర్వాత డైరెక్టర్ సుకుమార్ వచ్చి అల్లు అర్జున్‌ను హగ్ చేసుకున్నారు. కాసేపటికే స్టార్ హీరో విజయ్ దేవరకొండ కూడా పుష్పరాజ్‌ను కలిశారు. మెగాస్టార్ సతీమణి సురేఖ కూడా బన్నీని కలిశారు. ఆ సమయంలో ఆమె ఎమోషనల్ అయ్యారు.


చేతుల్ని పట్టుకొని..

అల్లు అర్జున్‌ను కలిసేందుకు వచ్చిన సురేఖ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన్ను పట్టుకొని కన్నీళ్లను ఆపుకుంటూ ఎమోషనల్ అయ్యారు. దీంతో బన్నీ ఆమె చేతుల్ని పట్టుకొని కూల్ చేశారు. ఆమె తల మీద నిమురుతూ ముద్దు పెట్టారు. సురేఖతో పాటు బన్నీని పరామర్శించేందుకు టాలీవుడ్ ప్రముఖులంతా క్యూ కట్టారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, హీరో రానా దగ్గుబాటి, శ్రీకాంత్‌తో పాటు డైరెక్టర్ కొరటాల శివ, నిర్మాతలు దిల్ రాజు, నాగవంశీ లాంటి ప్రముఖులు బన్నీ ఇంటికి చేరుకున్నారు. తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారితో అల్లు అర్జున్ కాసేపు మాట్లాడారు.


Also Read:

అరెస్ట్ నుంచి రిలీజ్ వరకు.. టీ-షర్ట్‌తో అల్లు అర్జున్ స్ట్రాంగ్ మెసేజ్

ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్

అల్లు అర్జున్ విడుదల.. కానీ ఇంటికి వెళ్లలేదు

మెగా పవర్ చూపించారు కదా.. ఏకమైనా ఇండస్ట్రీ

For More Telangana And Telugu News

Updated Date - Dec 14 , 2024 | 11:24 AM