Allu Arjun: రేవతి కుటుంబానికి రూ.25 లక్షలు
ABN, Publish Date - Dec 07 , 2024 | 04:48 AM
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడంనా చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ స్పందించారు.
దాంతోపాటు.. వైద్య ఖర్చులు కూడా భరిస్తా
ఏం చేసినా.. ఆమె లేని లోటు పూరించలేం: అల్లు అర్జున్
హైదరాబాద్, డిసెంబరు 6: పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడంనా చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ స్పందించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామంటూ ఒక వీడియో విడుదల చేశారు. 20 ఏళ్లుగా ఆనవాయితీగా థియేటర్‌కు వెళ్లి అభిమానులతో సినిమా చూస్తున్నానని.. ఇన్నేళ్లలో ఎప్పుడూ ఏమీ జరగలేదని.. అనూహ్యంగా ఇప్పుడు జరిగిన ఘటన తమను కలచివేసిందని అందులో పేర్కొన్నారు. రేవతి మరణవార్త తెలియగానే తామంతా తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యామని చెప్పారు. ‘‘రేవతి కుటుంబానికి.. మా ప్రగాఢ సానుభూతి.
మేమేం చేసినా.. ఎంత మాట్లాడినా.. ఆ లోటు పూరించలేనిది’’ అని ఆవేదన వెలిబుచ్చారు. ‘‘మీకు మేమున్నాం. మావైపు నుంచి మీకు ఏ సాయం కావాలన్నా.. మా శక్తి మేరకు చేస్తాం. నా తరఫు నుంచి రూ.25 లక్షలు వారి భవిష్యత్తు కోసం ఇవ్వాలనుకుంటున్నాను. ఈ డబ్బుతో సంబంధం లేకుండా.. వైద్య ఖర్చులు కూడా భరిస్తా. ఆ కుటుంబం బాధ్యత నాది’’ అని భరోసా ఇచ్చారు. ‘‘మేము సినిమా తీసేది ప్రేక్షకులను సంతోషపెట్టాలనే. మీరంతా కుటుంబాలతో కలిసి థియేటర్లకు వచ్చి, చూసి ఆనందించాలనే. కాబట్టి, సినిమా చూడ్డానికి వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎంజాయ్ చేయండి. తిరిగి ఇంటికి క్షేమంగా వెళ్లండి’’ అని తన అభిమానులకు, ప్రేక్షకులకు హితవు పలికారు.
Updated Date - Dec 07 , 2024 | 04:48 AM