ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana: సజ్జనార్ సారూ.. ప్లీజ్ మా గోస చూడండి..

ABN, Publish Date - Oct 22 , 2024 | 02:41 PM

తెలంగాణ ఆర్టీసీ బస్సు ప్రయాణం అంటే జనాలు జడుసుకుంటున్నారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితమనే భావన ఉన్నప్పటికీ.. ఇబ్బంది పడుతూ వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రయాణికులకు సరిపడినన్ని బస్సులు నడపడం లేదనే ఆరోపణలు అధికమవుతున్నాయి.

TGSRTC

హైదరాబాద్, అక్టోబర్ 22: తెలంగాణ ఆర్టీసీ బస్సు ప్రయాణం అంటే జనాలు జడుసుకుంటున్నారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితమనే భావన ఉన్నప్పటికీ.. ఇబ్బంది పడుతూ వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రయాణికులకు సరిపడినన్ని బస్సులు నడపడం లేదనే ఆరోపణలు అధికమవుతున్నాయి. తాజాగా ఇదే సమస్యపై ఆమన్‌ గల్‌కు చెందిన విద్యార్థులు పలువురు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ఓ లేఖ రాశారు. తమ సమస్యను ఆర్థం చేసుకుని.. అవసరమైనన్ని బస్సులు నడపాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు.. బస్ పాస్ అంశంలో తాను ఎదుర్కొంటున్న అంశాలను సైతం సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీకి విద్యార్థులు ఒక లేఖ రాశారు.


తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు రంగారెడ్డి జిల్లాలోని ఆమన్‌గల్ విద్యార్థులు లేఖ రాశారు. ఆర్టీసీ బస్సుల్లో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు తాము పడుతున్న ఇబ్బందులను సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు. బస్సుల్లో ఫుట్‌బోర్డుపై వేలాడుతున్న వీడియోలను సజ్జనార్‌కు షేర్ చేశారు. ప్రయాణాల గురించి నిరంతరం ప్రజల్లో అవేర్‌నెస్ కల్పిస్తున్న సజ్జనార్.. బస్సుల్లో తాము ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పట్టించుకోవాలని విద్యార్థులు వేడుకున్నారు.


షాద్‌నగర్-ఆమన్ గల్ రూట్లలో బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నామంటూ విద్యార్థులు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు లేఖ రాశారు. షాద్ నగర్-ఆమన్‌గల్ రూట్‌లో గతంలో 10 బస్సులు నడిపితే.. ఇప్పుడు 4 బస్సులే నడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రూట్‌లో బస్సుల సంఖ్యను పెంచాలంటూ విద్యార్థులు తమ లేఖలో విజ్ఞప్తి చేశారు. అంతేకాదు.. బస్ పాస్ విషయంలో ఆర్టీసీ విధించిన నిబంధన సైతం తమకు ఇబ్బందిగా మారిందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. డిగ్రీ కాలేజీలు దూరంగా ఉండటంతో.. ఆర్టీసీ 35 కిలోమీటర్ల పరిమితి సరిపోవడం లేదన్నారు. డిగ్రీ, హైయ్యర్ ఎడ్యూకేషన్ చేసే వారి కోసం 45, 60 కిలోమీటర్ల వరకు బస్ పాస్ పరిమితిని పెంచాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.


అరకొర బస్సులు.. ప్రయాణికుల ఇక్కట్లు..

తెలంగాణలో ఆర్టీసీ బలోపేతం కోసం సంస్థ యాజమాన్యం ఎంతగానో కృషి చేస్తోంది. అనేక స్కీమ్స్ ప్రకటిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పించడంతో.. మహిళలంతా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం సాగిస్తున్నారు. అయితే, ఈ ఫ్రీ బస్సు పథకం కారణంగా బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో సంస్థ నడిపే బస్సులు.. ప్రయాణికులకు సరిపోవడం లేదు. బస్సులో నిలబడి మరీ ప్రయాణం సాగిస్తున్నారు. ఇక స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులైతే.. ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రయాణం సాగిస్తున్నారు. బస్సుల్లో ఫుట్‌బోర్డు‌పై ప్రయాణిస్తూ ఎంతో మంది విద్యార్థులు ప్రమాదానికి గురైన ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.


Updated Date - Oct 22 , 2024 | 02:41 PM