ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Award: ‘ఆంధ్రజ్యోతి’ జర్నలిస్ట్‌ కారుసాల వెంకటేష్‌కు మోటూరు హనుమంతరావు పురస్కారం

ABN, Publish Date - Aug 17 , 2024 | 03:31 AM

ప్రజాశక్తి పూర్వ సంపాదకులు మోటూరు హనుమంతరావు స్మారక ఉత్తమ జర్నలిస్టు పురస్కారానికి ‘ఆంధ్రజ్యోతి’ సీనియర్‌ రిపోర్టర్‌ కారుసాల వెంకటేష్‌ ఎంపికయ్యారు.

  • 20న విజయవాడలో అవార్డు ప్రదానం

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): ప్రజాశక్తి పూర్వ సంపాదకులు మోటూరు హనుమంతరావు స్మారక ఉత్తమ జర్నలిస్టు పురస్కారానికి ‘ఆంధ్రజ్యోతి’ సీనియర్‌ రిపోర్టర్‌ కారుసాల వెంకటేష్‌ ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు పత్రికలలో పనిచేస్తున్న జర్నలిస్టుల నుంచి ఎంట్రీలు రాగా.. మానవాసక్తి, సామాజిక ప్రయోజనం మేళవిస్తూ కథనాలు రాసిన, ఇంటర్వ్యూలు చేసిన వెంకటే్‌షను అవార్డు కమిటీ ఎంపిక చేసినట్లు ప్రజాశక్తి సాహితీ సంస్థ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్‌ శర్మ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.


సీనియర్‌ సంపాదకులు తెలకపల్లి రవి అధ్యక్షతన నాగార్జున యూనివర్సిటీ జర్నలిజం విభాగం అధిపతి ప్రొఫెసర్‌ జి.అనిత, సీనియర్‌ జర్నలిస్టు నల్లి ధర్మారావుతో కూడిన అవార్డు కమిటీ ప్రతిపాదనలను పరిశీలించింది. ఈ నెల 20న విజయవాడలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో జరిగే సభలో వెంకటే్‌షకు అవార్డును ప్రదానం చేయనున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ నవ్యలో ‘అప్పట్లో మా కోడ్‌ రాప్సన్‌’.. ‘ఎమ్మెల్యే అయ్యాక కూడా చెప్పులు కుట్టేవారు’.. ‘చొరబాటుదారులు అనడం అన్యాయం’.. శీర్షికలతో వెంకటేష్‌ (కలం పేరు సాంత్వన్‌) రాసిన కథనాలు మానవాసక్తి రేకెత్తించాయని అవార్డు కమిటీ అభిప్రాయపడింది. ప్రజాశక్తి సాహితీ సంస్థ 2002 నుంచి మోటూరు స్మారక అవార్డును అందజేస్తోంది.

Updated Date - Aug 17 , 2024 | 03:32 AM

Advertising
Advertising
<