ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Polls: లోక్‌సభ తర్వాత తెలంగాణలో మరో ఉప ఎన్నిక!

ABN, Publish Date - Mar 24 , 2024 | 01:13 PM

తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి మే-13న ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను రాజకీయ పార్టీలు దాదాపు పూర్తి చేశాయి. రెండు, మూడు నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. వీటిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఏకైక నియోజకవర్గం సికింద్రాబాద్

తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి మే-13న ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను రాజకీయ పార్టీలు దాదాపు పూర్తి చేశాయి. రెండు, మూడు నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. వీటిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఏకైక నియోజకవర్గం సికింద్రాబాద్ (Secunderabad). ప్రస్తుతం ఇక్కడి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి (Kishanreddy) ఎంపీగా ఉన్నారు. ఆయన కేంద్రమంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడి నుంచి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కూడా తమ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటీ చేస్తుండగా.. బీఆర్‌ఎస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్(Padmarao Goud) పోటీలో ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి నాలుగు సార్లు పద్మారావు గౌడ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల దానం నాగేందర్ బీఆర్‌ఎస్ వీడి కాంగ్రెస్‌లో చేరి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. ఇక్కడి నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ తరపున ఇద్దరు ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు.

Lok Sabha Elections 2024: కమలం-హస్తం మధ్య నలిగిపోతున్న 'కారు'.. రిపేర్ అయ్యేదెప్పుడో!

ఆ ఇద్దరే ఎందుకు..

సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో 2014, 2019 ఎన్నికల్లో బీజేపీనే గెలుస్తూ వస్తోంది. దీంతో ఆ పార్టీకి చెక్ పెట్టేందుకు బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని రెండు పార్టీలు భావించాయి. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఉన్న పద్మారావు గౌడ్‌ను పోటీకి దింపితే విజయం సాధించవచ్చనే అంచనాతో బీఆర్‌ఎస్ ఎంపిక చేసిందనే వార్తలు గుప్పుమంటున్నాయ్. మరోవైపు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్‌.. కిషన్‌రెడ్డి గట్టిపోటీ ఇవ్వగలరనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఎంపిక చేసిందనే వాదన ఉంది. మరోవైపు కిషన్‌రెడ్డిని గెలిపించడానికే రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయనే రాజకీయ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరూ ఓడిపోయినా ప్రత్యేకంగా వారికి వచ్చిన నష్టం ఏమీలేదు. వారి ఎమ్మెల్యే పదవులు వారికి ఉంటాయి. ఎంపీగా గెలిస్తేనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా కేంద్రమంత్రి వర్సెస్ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య పోటీ రసవత్తరం కానుంది.

ఉపఎన్నిక..

సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే వారి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వస్తుంది. గతంలో కిషన్‌రెడ్డి అంబర్‌పేటలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత సికింద్రాబాద్‌ ఎంపీగా గెలిచారు. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న ఈ ఇద్దరూ లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి పోటీ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రజల తీర్పు ఎలా ఉంటుందనేది జూన్-04న తేలిపోనుంది.

Kishan Reddy: ఎంపీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో ఓటింగ్ శాతం పెరగాలి

BRS: బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్‌ రావుపై కేసు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 24 , 2024 | 01:35 PM

Advertising
Advertising