Kavitha Delhi Liquor case: కవిత కేసులో మరో ట్విస్ట్.. రిమాండ్ పై జడ్జి ఏమన్నారంటే?
ABN, Publish Date - Mar 16 , 2024 | 03:27 PM
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవితకు సంబంధించి వరుస ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి.నిన్న హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లిన ఈడీ అధికారులు.. ఈ ఉదయం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. కవిత కేసుకు సంబంధించిన వాదనలు విన్న సీబీఐ (CBI) స్పెషల్ జడ్జ్ ఎం.కె నాగ్ పాల్ తదుపరి విచారణ మధ్యాహ్ననికి వాయిదా వేశారు. లంచ్ బ్రేక్ తర్వాత వాదనలు ప్రారంభమయ్యాయి.
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు సంబంధించి వరుస ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. నిన్న హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లిన ఈడీ అధికారులు.. ఈ ఉదయం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. కవిత కేసుకు సంబంధించిన వాదనలు విన్న సీబీఐ (CBI) స్పెషల్ జడ్జ్ ఎం.కె నాగ్ పాల్ తదుపరి విచారణ మధ్యాహ్ననికి వాయిదా వేశారు. లంచ్ బ్రేక్ తర్వాత వాదనలు ప్రారంభమయ్యాయి. కవిత తరుపున విక్రమ్ చౌదరి, మోహిత్ రావు వాదనలు వినిపించగా.. ఈడీ (ED) తరుఫున ఎన్. కె మట్టా, జోసెబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. సాయంత్రం 4.30 గంటలకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత నిందితురాలిగా ఉన్నారని, ఆమెను తదుపరి విచారణ కోసం ఈడీ కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోరారు. మరోవైపు కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆమె తరపు లాయర్లు వాదనలు వినిపించారు. ఈ అరెస్ట్ అక్రమమని, రిమాండ్ కు ఇవ్వొద్దని న్యాయవాదులు కోరారు.
కవితను అధికార దుర్వినియోగంతో అరెస్ట్ చేశారని.. సెప్టెంబర్ 15న సుప్రీంకోర్టు(Suprem Court)లో ఇచ్చిన మాట ఉల్లంఘించారన్నారు. తదుపరి విచారణ జరిగే వరకూ ఎలాంటి చర్యలు తీసుకోబోమని చెప్పి, ఉల్లంఘించారన్నారు. మహిళను ఈడీ కోర్టుకు పిలవడానికి సంబంధించి కవిత ఫైల్ చేసిన కేసు పెండింగ్‌లో ఉందన్నారు. ఓపెన్ కోర్టులో ఇచ్చిన స్టేట్మెంట్‌కు అధికారులు కట్టుబడి లేరని కవిత తరుపు న్యాయవాదులు వాదించారు.
ఇవి కూడా చదవండి
MLC Kavitha: కవిత తరుఫున లాయర్ విక్రమ్ వాదనలేంటంటే..
TG Politics: బీఆర్‌ఎస్‌కు షాక్.. పార్టీకి మాజీ ఎమ్మెల్సీ గుడ్ బై?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 16 , 2024 | 04:17 PM