ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

LokSabha Elections: ఓ వైపు పుట్టిన రోజు.. మరో వైపు ఎన్నికలు

ABN, Publish Date - May 13 , 2024 | 03:29 PM

ఎంఐఎం పార్టీకి హైదరాబాద్ లోక్‌సభ స్థానం కంచుకోట అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ స్థానం నుంచి ఎంఐఎం అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ వరుసగా గెలుస్తున్నారు.

హైదరాబాద్, మే 13: ఎంఐఎం పార్టీకి హైదరాబాద్ లోక్‌సభ స్థానం కంచుకోట అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ స్థానం నుంచి ఎంఐఎం అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ వరుసగా గెలుస్తున్నారు. అయితే ఈ ఎన్నికల వేళ హైదరాబాద్ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ కృత నిశ్చయంతో ఉంది. ఆ క్రమంలో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కె. మాధవి లతను బీజేపీ ఎన్నికల బరిలో నిలిపింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని పాత బస్తీతోపాటు పలు ప్రాంతాలపై ఆమెకు మంచి పట్టు ఉంది. దీంతో సదరు లోక్‌సభ నియోజకవర్గంలో ఆమె.. తన ప్రచారాన్ని హోరెత్తించారు.


దాంతో హైదరాబాద్ లోక్‌సభ స్థానాన్ని ఎవరు కైవసం చేసుకుంటారనేది ఆసక్తిగా మారింది. మరోవైపు మే 13వ తేదీ ఎంఐఎం లోక్‌సభ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ జన్మదినం. ఆయన 55వ జన్మదినం ఈ రోజు. 1969, మే 13వ తేదీన సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ, నిజామున్నీసా బేగం దంపతులకు అసదుద్దీన్ ఓవైసీ జన్మించారు.

LoKSabha Elections: పోలింగ్‌ బహిష్కరించిన పలు గ్రామాల ప్రజలు

2004 ఎన్నికల నాటి నుంచి హైదరాబాద్ లోక్‌సభ‌ సభ్యుడిగా ఆయన వరుసగా గెలుస్తూ వస్తున్నారు. అంతకుముందు అంటే.. 2004కు ముందు అసదుద్దీన్ ఎమ్మెల్యేగా పలుమార్లు విజయం సాధించిన విషయం విదితమే. ఇక హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్‌ను ఆ పార్టీ బరిలో దింపింది.


Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా ఉదయం 11 గంటల పోలింగ్ శాతమిదే.. ఆ రాష్ట్రంలో అత్యధికం

ఇంకోవైపు పాత బస్తీలోని పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. అయితే ముస్లిం మహిళలు బురఖా ధరించి పోలింగ్ స్టేషన్లకు భారీగా తరలి వచ్చారు. ఆ క్రమంలో మాధవీ లత తన నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్‌‌లో ఓటింగ్ సరళని పరిశీలించారు.

Bomb Threat: పాఠశాలలకు మళ్లీ బాంబు బెదిరింపులు..

బూత్‌లో కూర్చున్న ముస్లిం ఓటర్ల బురఖాలను తొలగించాలని విజ్జప్తి చేసి.. వారి ఓటర్ ఐడీల పరిశీలించారు. అజాంపూర్‌లోని పోలింగ్ బూత్ నెంబర్ 122లో ఆమె ఈ వెరిఫికేషన్ చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లతపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆమెపై కేసు నమోదు అయింది.

Read Latest National News And Telugu News

Updated Date - May 13 , 2024 | 03:30 PM

Advertising
Advertising