ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tribal Woman: జైనూరు ఘటన.. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణ

ABN, Publish Date - Sep 06 , 2024 | 05:06 AM

ఆసిఫాబాద్‌ జిల్లా జైనూరులో గిరిజన మహిళపై ఆటో డ్రైవర్‌ అత్యాచార యత్నం కేసును ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో విచారణ చేపట్టాలని పోలీస్‌ ఉన్నతాధికారులు నిర్ణయించారు.

  • పోలీసు ఉన్నతాధికారుల నిర్ణయం.. జైనూరులోనే అదనపు డీజీ, ఐజీ మకాం

  • మరో 2 రోజులు ఇంటర్నెట్‌ బంద్‌, 144 సెక్షన్‌ కొనసాగింపు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌) : ఆసిఫాబాద్‌ జిల్లా జైనూరులో గిరిజన మహిళపై ఆటో డ్రైవర్‌ అత్యాచార యత్నం కేసును ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో విచారణ చేపట్టాలని పోలీస్‌ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బాధితురాలికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కేసు తీవ్రత దృష్ట్యా డీఎస్పీ నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. మరోవైపు, బుధవారం జైనూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.


అల్లర్లలో పాల్గొన్న ఇరు వర్గాల వ్యక్తులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. జైనూరుతోపాటు ఇంద్రవెల్లి, ఉట్నూర్‌, నార్నూర్‌, గాదిగూడ మండలాల్లోనూ 144 సెక్షన్‌ విధించారు. పికెటింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు. జైనూరు నుంచి ఆసిఫాబాద్‌, ఉట్నూరు వైపు ఎవరూ వెళ్లకుండా, జైనూరులో ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఆంక్షలను విధించారు. సోషల్‌ మీడియాను కట్టడి చేసేందుకు మరో రెండు రోజులు ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేయాలని నిర్ణయించారు. మరోవైపు.. అదనపు డీజీపీ (శాంతి, భద్రతలు) మహేశ్‌ భగవత్‌, ఐజీ చంద్రశేఖర్‌ రెడ్డి జైనూర్‌లోనే మకాం వేశారు.


మహేశ్‌ భగవత్‌ ఇరువర్గాల పెద్దలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఆదివాసీ మహిళపై దాడి జరగడం బాఽధాకరమని, ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని కోరారు.అల్లర్లలో జరిగిన ఆస్తి నష్టంపై నివేదిక అందించేందుకు కాగజ్‌నగర్‌ డీఎస్పీ కరుణాకర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించినట్లు తెలిపారు. కాగా, జైనూరు ఘటనను నిరసిస్తూ కెరమెరి, వాంకిడి, సిర్పూర్‌(యు), తిర్యాణి మండలాల్లోనూ ఆదివాసీలు బంద్‌కు పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి, కాసిపేటలో నిరసన తెలిపారు. జైనూరు వెళ్లేందుకు యత్నించిన ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల శంకర్‌, సిర్పూరు ఎమ్మెల్యే హరీశ్‌బాబును పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు.


  • మంత్రి సీతక్కతో బీజేపీ నేతల వాగ్వాదం

గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని మంత్రి సీతక్క రెండోసారి పరామర్శించేందుకు వచ్చారు. బాధితురాలి కుటుంబీకులతో మాట్లాడి.. వైద్యం, ఇతర ఖర్చుల నిమిత్తం రూ.లక్ష చెక్కును అందజేశారు. కార్పొరేట్‌ స్థాయిలో వైద్యం అందుతుందని, ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు. మం త్రి తిరిగి వెళ్తున్న సమయంలో ఆమె కారును బీజేపీ మహిళా నేత శిల్పారెడ్డి, కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించి వాగ్వాదానికి దిగారు.


దీంతో పోలీసులు ఎంసీహెచ్‌ భవనం ముందు నుంచి మంత్రిని బయటికి పంపించారు. సీతక్క స్పందిస్తూ.. బీజేపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తూ, విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. జైనూరు ఘటన నిందితులను రక్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం హేయమని ఆదిలాబాద్‌ ఎంపీ నగేశ్‌ విమర్శించారు. జైనూరు ఘటనను విశ్వ హిందూపరిషత్‌ ఖండించింది. స్థానిక పోలీసు యంత్రాంగం నిందితులకే వత్తాసు పలకడం బాధాకరమని మండిపడింది.

Updated Date - Sep 06 , 2024 | 05:06 AM

Advertising
Advertising