Phone Tapping Case: సస్పెన్షన్ వేటు
ABN , Publish Date - Mar 30 , 2024 | 06:48 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులపై చర్యలకు ఉన్నతాధికారులు ఉపక్రమించారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులపై సస్పెన్షన్ వేటు పడింది.
హైదరాబాద్, మార్చి 30: ఫోన్ ట్యాపింగ్ కేసు (phone tapping case)లో అధికారులపై చర్యలకు ఉన్నతాధికారులు ఉపక్రమించారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రసుత్తం ఈ అధికారులు కస్టడి విచారణ ఎదుర్కొంటున్నారు. మరోవైపు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఫోన్ టాపింగ్‌కు సంబంధించి కీలకమైన ఆధారాలను దర్యాప్తు బృందం సేకరించింది.
ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగారావులను న్యాయవాది సమక్షంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇక ఫోన్ టాపింగ్ కేసులో వీరిద్దరు కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అలాగే వీరిద్దరి ఫోన్‌లో వాట్సాప్ చాటింగ్‌ని సైతం ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. ఇక ఇదే కేసులో మరో ఇద్దరు సిఐలను సైతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
రాధా కిషన్ రావు ఇచ్చిన సమాచారం మేరకే ఈ ఇద్దరిని దర్యాప్తు బృందం ప్రశ్నిస్తోంది. రాధాకిషన్‌రావును వారం రోజులపాటు కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పోలీసులు సోమవారం పిటిషన్ వేయనున్నారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో లింకులున్న రాజకీయ నాయకులను త్వరలో విచారణకు పిలిచేందుకు.. నోటీసులు రూపోందిస్తున్నట్లు తెలుస్తోంది.