Hyderabad: రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం అమలు
ABN, Publish Date - Oct 18 , 2024 | 03:12 AM
రాష్ట్రంలో జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. బాలకిప్టా రెడ్డి తెలిపారు. గురువారం మాసాబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్‌గా ఆయన బాధ్యతలను స్వీకరించారు.
ప్రపంచంతో పోటీ పడేలా సిలబస్ మార్పు అవసరం
ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా బాలకిష్టారెడ్డి బాధ్యతలు
హైదరాబాద్, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. బాలకిప్టా రెడ్డి తెలిపారు. గురువారం మాసాబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్‌గా ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచంతో పోటీ పడాలంటే నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలని, రానున్న అయిదు, పదేళ్ల అవసరాలకనుగుణంగా సిలబసును రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చదువు కోసం మనం వెళ్లకుండా, మన ఇంటికే విద్య అందేలా మార్పులు చేయాలన్నారు.
జాతీయ విద్యావిధానం అమలు చేస్తేనే యూజీసీ, కేంద్రం నుంచి నిధులు వచ్చే పరిస్థితి ఉంటుందన్నారు. పదేళ్లుగా వర్సిటీల్లో నియామక ప్రక్రియ నిలిచిపోయిందని, సరిపడా సిబ్బంది లేరని ఆయన తెలిపారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు కమిట్‌మెంట్‌తో పనిచేయడం లేదని వ్యాఖ్యానించారు. ఉన్నత విద్యా మండలిలో పలు సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ తమపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించారని, ఉన్నత విద్యాభివృద్థిలో మార్పులు తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. మరోవైపు ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్‌గా ప్రొ. పురుషోత్తం బాధ్యతలు స్వీకరించారు.
Updated Date - Oct 18 , 2024 | 03:12 AM