ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Abhilasha Abhinav: ‘బాలశక్తి’తో బంగారు భవిత..

ABN, Publish Date - Sep 21 , 2024 | 04:36 AM

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల మెరుగైన భవిష్యత్‌ కోసం నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

  • విద్యార్థుల ఆరోగ్య, ఆర్థిక అక్షరాస్యత.. నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమం

  • 6-12తరగతుల వారికి అవగాహన తరగతులు

  • నిర్మల్‌ కలెక్టర్‌ అభిలాష వినూత్న ఆలోచన

నిర్మల్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల మెరుగైన భవిష్యత్‌ కోసం నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్యం, ఆర్థిక అక్షరాస్యతతోపాటు నైపుణ్యాభివృద్ధిపై పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ‘బాలశక్తి’ పేరిట ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్మల్‌ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి అమలు చేస్తున్నారు. బాలశక్తిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు, జూనియర్‌ కాలేజీ స్థాయిలో ఇంటర్‌ ఫస్టయిర్‌, సెకండియర్‌ విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.


ఈ కార్యక్రమం కింద విద్యార్థులకు పోషక విలువలు కలిగిన మంచి ఆహారాన్ని అందిస్తారు. వ్యక్తిగత, పరిసరాల శుభ్రత, శారీరక, మానసిక ఆరోగ్యంపై శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. అలాగే, విద్యార్థులను బ్యాంకులు, న్యాయస్థానాలు, పోస్టాఫీసులు, పోలీసు స్టేషన్లు, పంచాయతీ కార్యాలయాలు, మీ సేవా, అంగన్‌వాడీ కేంద్రాలు, పీహెచ్‌సీల పర్యటనలకు తీసుకెళ్లి. వివిధ అంశాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తారు. ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, వైద్యులు, బ్యాంకర్ల సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


దీంతో పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు అనేక అంశాలపై అవగాహన కలుగుతుందని, అది వాళ్లని జీవితంలో ఉన్నతస్థాయికి తీసుకెళుతుందనేది ఆలోచన. జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో పర్యటించి విద్యార్థుల పరిస్థితిని స్వయంగా పరిశీలించిన కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ ఈ బాలశక్తికి రూపకల్పన చేశారు. బాలశక్తిని ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు జిల్లాలోని 52 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశారు. అంతేకాక, నిర్మల్‌లోని కస్బా మైనారిటీ గురుకుల పాఠశాలలో బాలశక్తి కార్యక్రమాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించారు.


  • బాలశక్తితో అనేక ప్రయోజనాలు

బాలశక్తితో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆర్థిక అక్షరాస్యత, ఆరోగ్య, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలను ఈ కార్యక్రమంలో చేర్చాం. క్షేత్రస్థాయి పర్యటనలు, వ్యక్తిగత అనుభవాలు విద్యార్థులకు ఎంతో మేలు చేస్తాయి. పాఠశాలల్లో వైద్య శిబిరాల ఏర్పాటు చేసి హెల్త్‌ ప్రొఫైల్స్‌ కూడా తయారు చేస్తాం. వ్యక్తిగత పరిశుభ్రత, పౌష్టికాహారం, వ్యాధులు, ఒత్తిడిని ఎదుర్కోవడం, స్వీయ రక్షణ అంశాలపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించాం

- నిర్మల్‌ కలెక్టర్‌ అభిలాష

Updated Date - Sep 21 , 2024 | 04:36 AM