ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG Politics: సీఎం రేవంత్ రెడ్డికి బాల్క సుమన్ లేఖ... కారణమిదే..?

ABN, Publish Date - Mar 23 , 2024 | 07:33 PM

టెట్ -2024 పరీక్ష ఫీజులను విద్యాశాఖ భారీగా పెంచిందని బీఆర్ఎస్ సీనియర్ నేత బాల్కసుమన్(Balka Suman) అన్నారు. శనివారం నాడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కి బాల్కసుమన్ లేఖ రాశారు. టెట్ పరీక్ష ఫీజు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఒక పేపర్ రాస్తే రూ.200ల ఫీజు, రెండు రాసిన వారికి 300 రూపాయల ఫీజు మాత్రమే ఉండేదని తెలిపారు. త్వరలో జరుగబోయే టెట్ పరీక్ష ఫీజుకి సంబంధించి ఒక పేపర్‌కు రూ. 1000, రెండు పేపర్లకు రూ. 2000లకు పెంచడం సరికాదని అన్నారు.

హైదరాబాద్: టెట్ -2024 పరీక్ష ఫీజులను విద్యాశాఖ భారీగా పెంచిందని బీఆర్ఎస్ సీనియర్ నేత బాల్కసుమన్(Balka Suman) అన్నారు. శనివారం నాడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కి బాల్కసుమన్ లేఖ రాశారు. టెట్ పరీక్ష ఫీజు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఒక పేపర్ రాస్తే రూ.200ల ఫీజు, రెండు రాసిన వారికి 300 రూపాయల ఫీజు మాత్రమే ఉండేదని తెలిపారు. త్వరలో జరుగబోయే టెట్ పరీక్ష ఫీజుకి సంబంధించి ఒక పేపర్‌కు రూ. 1000, రెండు పేపర్లకు రూ. 2000లకు పెంచడం సరికాదని అన్నారు.

పెంచిన ఫీజుల వల్ల నిరుపేద, మధ్యతరగతి అభ్యర్థులపై చాలా భారం పడుతుందని చెప్పారు. కేవలం 11 జిల్లా కేంద్రాల్లోనే టెట్ పరీక్ష కేంద్రాలు ఉంటాయని ప్రకటించారని.. దీని వల్ల మిగతా జిల్లాల అభ్యర్థులు ఇబ్బంది పడతారని అన్నారు. దూరభారంతో పాటు ఆర్థికంగానూ భారం పడుతుందని వివరించారు. మొత్తం 33 జిల్లా కేంద్రాల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. 7 లక్షల మంది నిరుద్యోగుల సమస్యను అర్ధం చేసుకుని పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని బాల్క సుమన్ కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 23 , 2024 | 07:33 PM

Advertising
Advertising