ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bandi Sanjay: కేసీఆర్‌ ఫాంహౌస్‌ ముందు ధర్నా చెయ్‌

ABN, Publish Date - Oct 16 , 2024 | 03:30 AM

వికారాబాద్‌ జిల్లా దామగుండం అడవుల్లో రాడార్‌ స్టేషన్‌ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు సిగ్గుండాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు.

  • నాడు రేడార్‌ వ్యవస్థకు ఎందుకు అనుమతిచ్చారో అడుగు

  • కేటీఆర్‌పై ధ్వజమెత్తిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌

హైదరాబాద్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్‌ జిల్లా దామగుండం అడవుల్లో రాడార్‌ స్టేషన్‌ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు సిగ్గుండాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. నాడు సీఎంగా ఉన్న కేసీఆర్‌ సోయిలో ఉండే అనుమతులు ఇచ్చారా? లేదా? తెలుసుకోవాలని సూచించారు. అనుమతులు ఎందుకు ఇచ్చారో నిలదీస్తూ కేసీఆర్‌ ఫాంహౌస్‌ ముందు ధర్నా చేయాలని కేటీఆర్‌కు సూచించారు.


కేసీఆర్‌ ప్రభుత్వం ఆమోదించిన వ్యవస్థను ఆయన కొడుకు ఆధ్వర్యంలో పార్టీ నేతలు వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 1174 హెక్టార్ల భూమిని రాడార్‌ స్టేషన్‌ ఏర్పాటుకు బదిలీ చేస్తూ 2017న డిసెంబరు 19న అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జీవో 44 జారీ చేసిందని గుర్తుచేశారు. రాడార్‌ స్టేషన్‌ ఏర్పాటు అంశం ఇప్పటిది కాదని.. పద్నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉందని చెప్పారు. ఎట్టకేలకు భూమి పూజ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ చొరవతోనే ఇది సాధ్యమైందని సంజయ్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

Updated Date - Oct 16 , 2024 | 03:30 AM