ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bandi Sanjay: బీజేపీకి అధికారమిచ్చుంటే కేసీఆర్‌కు ‘అంకుశమే’

ABN, Publish Date - Sep 12 , 2024 | 04:19 AM

మాజీ సీఎం కేసీఆర్‌ కుటుంబాన్ని జైల్లో పెట్టడం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి సాధ్యం కావడం లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు.

  • రామిరెడ్డిని గుంజుకుపోయినట్టుగా జైల్లో పెట్టేవాళ్లం

  • మాజీ సీఎం కుటుంబాన్ని ఖైదు చేయడం రేవంత్‌ వల్ల కావట్లే

  • వరదలతో జనం అల్లాడుతున్నా కేసీఆర్‌ బయటికి రారేం ?

  • రాహుల్‌ గాంధీకి దేశంలో ఉండే అర్హత లేదు: : బండి సంజయ్‌

హైదరాబాద్‌ సిటీ, రాయదుర్గం, సెప్టెంబరు11 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం కేసీఆర్‌ కుటుంబాన్ని జైల్లో పెట్టడం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి సాధ్యం కావడం లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. రాష్ట్ర ప్రజలు బీజేపీకి అధికారం ఇచ్చి ఉంటే.. అంకుశం సినిమాలో రామిరెడ్డిని గుంజుకుపోయినట్టుగానే కేసీఆర్‌ కుటుంబాన్ని గుంజుకుపోయి జైల్లో పెట్టేవాళ్లమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గచ్చిబౌలిలోని ఓ కన్వెన్షన్‌ హాల్‌లో బుధవారం జరిగిన శేరిలింగంపల్లి నియోజకవర్గ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ పెద్దలతో మాట్లాడుకున్నారని, అందువల్లే రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌ కుటుంబం జోలికి వెళ్లడం లేదని ఆరోపించారు.


విదేశాల్లో భారతదేశంపై తీవ్ర విమర్శలు చేస్తోన్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి ఈ దేశంలో ఉండే అర్హత లేదని పేర్కొన్నారు. ‘మిస్టర్‌ రాహుల్‌ గాంధీ... క్విట్‌ ఇండియా’ అని నినదించారు. వరదలతో జనం అల్లాడుతుంటే కేసీఆర్‌ ప్రజల్లోకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ప్రజలు కేసీఆర్‌కు ’నో ఎంట్రీ బోర్డు‘ పెట్టేశారని రీఎంట్రీ కలే అని ఎద్దేవా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చెయ్యి గుర్తుకు ఓట్లేస్తే అది నేడు భస్మాసుర హస్తమైందని ప్రజలు బాధపడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అతి తక్కువ కాలంలో అత్యధిక ప్రజా వ్యతిరేక మూటకట్టుకున్న పార్టీ కాంగ్రెస్‌ అన్నారు. హామీల నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకే రుణమాఫీ సర్వే, హైడ్రా అంటూ ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కలిసి ప్రజలను మోసగిస్తున్నాయని ఆరోపించారు.

Updated Date - Sep 12 , 2024 | 04:19 AM

Advertising
Advertising