ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉగ్ర కుట్రల్లో ఒవైసీ కాలేజీ ఫ్యాకల్టీ

ABN, Publish Date - Sep 23 , 2024 | 03:22 AM

ఉగ్రవాదులను పెంచి పోషించేది మజ్లిస్‌ పార్టీ అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ మండిపడ్డారు. ఒవైసీకి చెందిన కాలేజీలో పని చేసిన ఓ ఫ్యాకల్టీని ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడని గతంలో అరెస్టు చేశారని గుర్తుచేశారు.

  • ఉగ్రవాదులను పెంచి పోషించేది ఎంఐఎం పార్టీనే

  • తిరుపతి లడ్డూ కల్తీ.. హిందూ ధర్మంపై దాడి

  • కాంగ్రెస్‌ సర్కారులో అవినీతి: బండి సంజయ్‌

కరీంనగర్‌(ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/మహదేవపూర్‌/మహేశ్వరం/హైదరాబాద్‌, సెప్టెంబరు 22: ఉగ్రవాదులను పెంచి పోషించేది మజ్లిస్‌ పార్టీ అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ మండిపడ్డారు. ఒవైసీకి చెందిన కాలేజీలో పని చేసిన ఓ ఫ్యాకల్టీని ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడని గతంలో అరెస్టు చేశారని గుర్తుచేశారు. సెక్యులర్‌ అనే వాళ్లు ఏనాడైనా హిందువుల పండుగను జరుపుకొన్నారా..? అని ప్రశ్నించారు. ఆదివారం ఆయన కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. హిందూ ధర్మంపై దాడిలో భాగంగానే తిరుపతి లడ్డూలో కల్తీ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు.

తిరుమల లడ్డూ వివాదంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా దృష్టి సారించారని తెలిపారు. కేటీఆర్‌కు మీడియా అంటే ఫోబియా అని, అమృత్‌ పథకం అక్రమాలపై ఫిర్యాదు చేస్తే కేంద్రం విచారణ చేస్తుందని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసు విచారణ ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని విమర్శించారు. కాంగ్రెస్‌ సర్కారు అవినీతిలో కూరుకుపోయిందని కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కాగా, భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో బీజేపీ సభ్యత్వ నమోదు చేస్తున్న క్రమంలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన కార్యకర్త మంథని రాజేందర్‌ కుటుంబాన్ని సంజయ్‌ ఆదివారం పరామర్శించి, కుటుంబ సభ్యులకు ఆర్థికసాయం చేశారు.

  • మోదీతో దేశానికి ప్రపంచస్థాయి గుర్తింపు: లక్ష్మణ్‌

ప్రధాని మోదీ పాలనలో దేశానికి ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చిందని, ఇది చూసి ఓర్వలేని కాంగ్రెస్‌.. లేనిపోని నిందలువేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. మోదీ జన్మదినం సందర్భంగా తుక్కుగూడలో నిర్వహించిన రక్తదాన, ఉచిత వైద్య శిబిరంలో ఆయన మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు మాట్లాడుతూ.. వక్ఫ్‌ సవరణ బిల్లుపై ముస్లింలను తప్పుదోవ పట్టించవద్దని మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌కు విజ్ఞప్తి చేశారు.

Updated Date - Sep 23 , 2024 | 03:22 AM