మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bandi Sanjay : ఓట్ల కోసం శ్రీరాముడిని వాడుకోవడం లేదు

ABN, Publish Date - Apr 21 , 2024 | 02:14 PM

ఓట్లు కోసం శ్రీరాముడి పేరు వాడుకోవడం లేదని కరీంనగర్ ఎంపీ ఒండి సంజయ్ స్పష్టం చేశారు. భక్తితో రాముడి పేరు వాడుకుంటున్నామన్నారు. బీఆర్ఎస్ వాళ్లు గుడిని మింగితే.. కాంగ్రెస్ వాళ్లు గుడి లోపలి లింగాన్ని మింగే రకమని ఆయన అభివర్ణించారు. ఆదివారం రాజన్న సిరిసిల్లలో పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల కోసం బీజేపీ పోరాడితే.. కాంగ్రెస్ వాళ్లకు ఓటు వేస్తారా ? అని ప్రశ్నించారు.

Bandi Sanjay : ఓట్ల కోసం శ్రీరాముడిని వాడుకోవడం లేదు
Bandi Sanjay

రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 21: ఓట్లు కోసం శ్రీరాముడి పేరు వాడుకోవడం లేదని కరీంనగర్ ఎంపీ ఒండి సంజయ్ స్పష్టం చేశారు. భక్తితో రాముడి పేరు వాడుకుంటున్నామన్నారు. బీఆర్ఎస్ వాళ్లు గుడిని మింగితే.. కాంగ్రెస్ వాళ్లు గుడి లోపలి లింగాన్ని మింగే రకమని ఆయన అభివర్ణించారు.

ఆదివారం రాజన్న సిరిసిల్లలో పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల కోసం బీజేపీ పోరాడితే.. కాంగ్రెస్ వాళ్లకు ఓటు వేస్తారా ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారని విమర్శించారు. రైతులకు నష్టపరిహారం కోసం పోరాటం చేశానని ఈ సందర్బంగా బండి సంజయ్ గుర్తు చేశారు. రైతులకు బోనస్, నష్టపరిహారం, మహిళలకు రూ. 2500 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని.. కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ హామీని నేరవేర్చలేదన్నారు.


తాను దీక్ష చేస్తానని భయపడి, నేతన్నలకు రూ. 50 కోట్ల బకాయిలు విడుదల చేశారని చెప్పారు. సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్‌లాగే కాంగ్రెస్ పార్టీ కూడా వ్యవహరిస్తే పుట్టగతులు లేకుండా పోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీలోని మంత్రి, కేటీఆర్‌లు మంచి దోస్తులన్నారు. కేసీఆర్‌ను గద్దె దించింది బీజేపీనేనని ఈ సందర్భంగా సంజయ్ గుర్తు చేశారు.

లోక్ సభ ఎన్నికల వేళ.. ఏదో ఒక అంశాన్ని ప్రధాని మోదీ తెరపైకి తీసుకు వస్తారని.. ఆ క్రమంలో ఈ సారి అయోధ్యలో శ్రీరాముడి అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అలాంటి వేళ.. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

మరోవైపు.. తెలంగాణలోని మొత్తం 17 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. వాటిని తమ ఖాతాలో వేసుకోవాలని.. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమదైన వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. మే 13న తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది.

తెలంగాణ వార్తలు కోసం..

Updated Date - Apr 21 , 2024 | 02:22 PM

Advertising
Advertising