lawyer safety: న్యాయవాదిపై దాడికి రాష్ట్ర బార్ కౌన్సిల్ ఖండన
ABN, Publish Date - Aug 31 , 2024 | 04:47 AM
వృత్తిపరమైన విధులు నిర్వహిస్తున్న న్యాయవాదులపై దాడులు పెరిగిపోతుండటంపై బార్ కౌన్సిల్ ఆందోళన వ్యక్తం చేసింది.
హైదరాబాద్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): వృత్తిపరమైన విధులు నిర్వహిస్తున్న న్యాయవాదులపై దాడులు పెరిగిపోతుండటంపై బార్ కౌన్సిల్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయమై చర్చించేందుకు వైస్ ఛైర్మన్ సునీల్‌గౌడ్, బీసీఐ సభ్యుడు పి. విష్ణువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించారు.
సంగారెడ్డిలో వృత్తిపరమైన విధులు నిర్వహిస్తున్న న్యాయవాది చైతన్యపై అవతలిపక్షంవారు దాడి చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కేసు వాదిస్తున్న న్యాయవాదులపై దాడులను ఖండించారు. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని డీజీపీకి; అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తీర్మానాలు చేశారు.
Updated Date - Aug 31 , 2024 | 04:47 AM