BC Declaration: కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి..
ABN, Publish Date - Jul 15 , 2024 | 03:24 AM
కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్ డిమాండ్ చేశారు.
కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్
కామారెడ్డి టౌన్, జూలై 14: కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిందని ఆయన గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్లను పెంచుతామని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించడం అభినందనీయమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాత నిర్వహించాలన్నారు. బీసీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతోనే బీసీలు కాంగ్రె్‌సను గెలిపించారన్న విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలని సూచించారు. ఆదివారం కామారెడ్డిలో ‘సమగ్ర కులగణన సాధన యాత్ర’ ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన సభలో జాజుల మాట్లాడారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర కులగణన చేపట్టాలన్న డిమాండ్‌తో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కామారెడ్డి నుంచి కరీంనగర్ వరకు ఈ నెల 14 నుంచి 31 వరకు ఈ యాత్ర నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా సమగ్ర కుల గణన చేస్తామని హామీ ఇచ్చి బీసీలను మోసం చేసినందుకే బీజేపీ 240 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందన్నారు. బిహార్ సీఎం నితీశ్, ఏపీ సీఎం చంద్రబాబు సామాజిక రిజర్వేషన్ల 50ు పరిధిని ఎత్తివేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, లేకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కోదండరాం గణేష్ చారి, బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రవికృష్ణ, కార్యనిర్వహణ అధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 15 , 2024 | 03:24 AM