Share News

Beerla Ilaiah: తెలంగాణ సమస్య అయిపోయింది.. బీసీ సమస్య ఎత్తుకొన్న..

ABN , Publish Date - Dec 30 , 2024 | 04:55 PM

Beerla Ilaiah: బీఆర్ఎస్ నాయకులు.. పదేండ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేశారని ప్రభుత్వ వీప్ బీర్ల ఐలయ్య మండిపడ్డారు. తెలంగాణను ఆ పార్టీ నేతలు.. ఓ ఏటీఎంలాగా వాడుకొన్నారని ఆరోపించారు. మతి భ్రమించి మాట్లాడుతున్నారంటూ కేటీఆర్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Beerla Ilaiah: తెలంగాణ సమస్య అయిపోయింది.. బీసీ సమస్య ఎత్తుకొన్న..
Congress Party MLA Beerla Ilaiah

హైదరాబాద్, డిసెంబర్ 30: కొత్త ఏడాదిలో బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు సినిమా చూపిస్తామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కథ క్లైమాక్స్‌కు వచ్చిందన్నారు. సోమవారం సీఎల్పీ మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వ వీప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. కొత్త ఏడాది 2025లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ ఖాయమని జోస్యం చెప్పారు. ఇక కొత్త సంవత్సరంలో హరీష్ రావు కొత్త దారి చూసుకుంటారని వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కేసులో బెయిల్‌పరై ఉన్న బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి బీసీల గురించి మాట్లాడే హక్కు ఎక్కడదని సూటిగా ప్రశ్నించారు. కవితకు ఏదో ఒక ఇష్యూ కావాలన్నారు.

బీఆర్ఎస్ నాయకులు.. పదేండ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేశారని మండిపడ్డారు. తెలంగాణను ఆ పార్టీ నేతలు.. ఓ ఏటీఎంలాగా వాడుకొన్నారని ఆరోపించారు. మతి భ్రమించి మాట్లాడుతున్నారంటూ కేటీఆర్‌పై బీర్ల ఐలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. 2025లో అయినా.. కేటీఆర్‌కి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నానన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి.. మాజీ ప్రధాని, ఇటీవలే దివంగతులైన మన్మోహన్ సింగ్ గురించి.. నాలుగు మంచి మాటలు మాట్లాడతారని తాము భావించామన్నారు.


అయితే అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడిన తీరు బాగుందని ప్రభుత్వ వీప్ బీర్ల ఐలయ్య ప్రశంసించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడంలో నాటి ప్రధానిగా మన్మోహన్ సింగ్ పాత్ర మరవలేనిదన్నారు. ఇక రానున్న సంక్రాంతికి రైతు భరోసా ఇవ్వబోతున్నామని ప్రకటించారు. ఫార్ములా ఈ రేసు కేసుకి కేటీఆర్ ఎందుకు భయపడుతున్నాడంటూ ఆయన సందేం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత హోదా కోసం కేటీఆర్, హరీష్ రావులు పోటీ పడుతున్నారని చెప్పారు.

beerla ilaiah.jpg

Also Read: రేవంత్ ఈగో చల్లబడింది..

Also Read: పేర్ని నాని ఫ్యామిలీకి మళ్లీ నోటీసులు

Also Read: లోక్‌సభలో అడుగు పెట్టిన ప్రియాంక


బీఆర్ఎస్, బీజేపీల మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయన్నారు. తెలంగాణ సమస్య అయిపోయిందని.. ఇప్పుడు బీసీ సమస్య ఎత్తుకున్నారంటూ బీఆర్ఎస్ నేతల తీరును తప్పు పట్టారు. బీసీలకు అన్యాయం చేశారనే ఎన్నికల్లో ఆ పార్టీ నేతలను బీసీలు బొంద పెట్టారన్నారు. పార్టీ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాలని బీఆర్ఎస్ అగ్రనేతలను బీర్ల ఐలయ్య డిమాండ్ చేశారు. కొత్త సంవత్సర వేడుకలను లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జరుపుకోరని తెలంగాణ ప్రభుత్వ వీప్ బీర్ల ఐలయ్య వెల్లడించారు.

For Telangana News And Telugu News

Updated Date - Dec 30 , 2024 | 05:53 PM