Share News

Hyderabad: సీఎం రేవంత్‌తో డిప్యూటీ సీఎం భట్టి భేటీ

ABN , Publish Date - Oct 29 , 2024 | 03:33 AM

రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై చర్చించేందుకు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో రెండు సార్లు భేటీ అయ్యారు.

Hyderabad: సీఎం రేవంత్‌తో డిప్యూటీ సీఎం భట్టి భేటీ

  • ఆర్థిక పరిస్థితి, నిధుల సమీకరణపై చర్చ

హైదరాబాద్‌, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై చర్చించేందుకు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో రెండు సార్లు భేటీ అయ్యారు. ఉదయం రేవంత్‌ను ఆయన నివాసంలో కలిసిన భట్టి విక్రమార్క.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నిధుల సమీకరణపై చర్చించారు. ప్రస్తుత పరిమిత ఆర్థిక వనరులతో.. సమీప భవిష్యత్తులో చేపట్టనున్న ప్రాజెక్టులు, పథకాల అమలుపై చర్చ జరిగినట్లు తెలిసింది.


ఇదే అంశంపై సాయంత్రం కూడా భట్టి విక్రమార్క సీఎంను మరోమారు ఆయన ఇంట్లో కలిసి చర్చించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రెడ్డి పాల్గొన్నారు. కాగా, సోమవారం తన జన్మదినం సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి.. సీఎం రేవంత్‌ రెడ్డిని ఉదయం ఆయన నివాసంలో కలిశారు. పొంగులేటికి రేవంత్‌ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Oct 29 , 2024 | 03:33 AM