ముందస్తు అడ్మిషన్ల పేరిట దోపిడీ
ABN , Publish Date - Apr 15 , 2025 | 11:05 PM
ముందస్తు అడ్మిషన్ల పేరిట రూ.లక్షల్లో దోపిడికీ పాల్పడుతున్న జిల్లాలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం పలువిద్యార్థి సంఘాల నాయకులు ఇన్‌చార్జి డీఈవో ఘనికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ప్రైవేట్ పాఠశాలలపై విద్యార్థి సంఘాల నాయకుల ఫిర్యాదు
గద్వాల సర్కిల్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): విద్యా సంవత్సర ప్రారంభానికి ముందే ముందస్తు అడ్మిషన్ల పేరిట రూ.లక్షల్లో దోపిడికీ పాల్పడుతున్న జిల్లాలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం పలువిద్యార్థి సంఘాల నాయకులు ఇన్‌చార్జి డీఈవో ఘనికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆకట్టుకునేలా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు నేషనల్, ఇంటర్నేషనల్ ట్యాగ్‌లైన్‌ను తగిలిస్తూ ఒక్కోఅడ్మిషన్ నుంచి రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మండలం, జిల్లా కేం ద్రంలోని పలుప్రాంతాల్లో ఆకర్షణీయమైన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి విద్యార్థులను, తల్లిదండ్రుల ను పలు పాఠశాలల యాజమాన్యాలు గందరగోళానికి గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. ముం దస్తు అడ్మిషన్ల పేరిట దోపిడీకి పాల్పడుతున్న పాఠశాలలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జి డీఈవోను పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు హలీంపాష, యూఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి రంగస్వామి కోరారు.